నల్గొండ

పేదోళ్ళ కష్టాలు తీర్చుతున్న కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్యాల, ఏప్రిల్ 26: గుడిసెల్లోని పేదళ్ళ కష్టాలను కూడా తెలుసుకుని ఇబ్బందుల్లేకుండా వారి కష్టాలు తీర్చుతున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అని విద్యుత్, షెడ్యూల్డ్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. మండలంలోని గుండ్రాంపల్లి గ్రామానికి మంజూరైన 56 డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి గురువారం ఎమ్మెల్యే వేముల వీరేశం, జిల్లా సంయుక్త కలెక్టర్ నారాయణరెడ్డి, ఆర్‌డీవో ఈ. వెంకటాచారి, ఎంపీపీ బట్టు అరుణఅయిలేష్, జెడ్పీటీసీ శేపూరి రవీందర్, సర్పంచ్ రాచకొండ లావణ్యకిష్టయ్యతో కలిసి మంత్రి జగదీష్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సమస్యలను తానే ముందుగా తెలుసుకుని పరిష్కరిస్తూ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదని సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. రాష్ట్రం ఏర్పడి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి గుండ్రాపల్లి గ్రామానికి సుమారు రూ. 10కోట్ల అభివృద్ధి నిధులు మంజూరైనాయన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎప్పుడు జరిగిందో ప్రజలకు తెలుసునని 2014లో రాష్ట్రం ఆవిర్భమయ్యాక తొలిసారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరిగిందని ఘంటాపథంగా చెబుతున్నానన్నారు. నియోజకవర్గంలో అత్యధికంగా పంటలు జరిగిన అధికంగా ధాన్యం దిగుబడి వచ్చిన నకిరేకల్ నియోజకవర్గం చరిత్ర సృష్టించిందన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో రూ. 2000ల కోట్లతో అభివృద్ధి సంక్షేమ పథకాలను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చేయించారని, ఎమ్మెల్యే వేముల వీరేశం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని ఇండ్లు లేని పేద ప్రజలకు ఒక గూడు ఉండాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మంగా దేశంలో ఎక్కడా లేని విధంగా పేదల కోసం డబుల్ బెడ్‌రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నారని అన్నారు. ఏదేని పనుల కోసం గతంలో ఎమ్మెల్యేల వద్దకు ప్రజాప్రతినిధులు నాయకులు ప్రజలు వెళ్ళి సందర్భాలు లేవని ఒక వేళ వెళ్ళినట్లయితే పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసుల కోసమేనని 3కేసులు 6కొట్లాటలేనని ఎద్దేవ చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేదట్టిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు వేలాది కోట్ల రూపాయలతో చేపడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారని దేశంలో ఎక్కడాలేని విధంగా దేశం గర్వించే విధంగా పథకాలు అమలవుతున్న తెలంగాణరాష్ట్రంలోనేనన్నారు. పేదకుటుంబాల్లో ఆడపిల్ల పుడితే వివక్ష చూపుతున్నారని ఆడపిల్లను పురిటిలోనే చంపడమే విక్రయించడమే జరుగుతుందని ఆడపిల్లను సంరక్షించడం భారంగా మారకుండా ఉండేందుకు వారి పెళ్ళిళ్ళు తల్లిదండ్రులకు కష్టం కాకూడదనే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ. 1,00,116లు ఇస్తున్నారన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించినట్లయితే రూ. 12000లు ప్రోత్సాహంగా ప్రభుత్వం అందజేస్తుందని ఆడపిల్ల పుడితే రూ. 1000లు అదనంగా ఇస్తుందని దాంతో పాటుగా తల్లీపిల్లలకు ఉపయోగపడేవిధంగా కేసీఆర్ కిట్‌లు కూడా అందచేసి ఇద్దరీని చేర్చుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో, వసతిగృహాల్లో చదువుకునే విద్యార్థులు జాతి ఆస్తులని వారు కడుపునిండా తినేందుకు ప్రభుత్వం సన్న బియ్యం సరఫరా చేస్తుందన్నారు. నాలుగేల్ళ అభివృద్ధి కొనసాగేలా సీఎం కేసీఆర్‌కు ప్రజలందరు అండగా నిలవాలని డబుల్ బెడ్‌రూం ఇండ్లను ఆరుమాసాల్లో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.