నల్గొండ

ప్రజల సంక్షేమమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్కట్‌పల్లి, ఏప్రిల్ 26: నిరుపేదల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, అందులో భాగంగానే అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచేందుకు కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని బ్రాహ్మణవెల్లంల గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెనువెంటనే నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలుపరుస్తూ ఆత్మస్థైర్యంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతూ అభివృద్ధి చేస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు రాష్ట్భ్రావృద్ధిని జీర్ణించుకోలేక అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఆడపిల్లలను భారంగా భావిస్తున్న నేటి సమాజంలో ఆడపిల్లే ఇంటి లక్ష్మి అని అనుకునే విధంగా కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌తో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారని చెప్పారు. వ్యవసాయ రంగం అభివృద్ధితో పాటు రైతుల సంక్షేమం కోసం 24 గంటల విద్యుత్, రైతు బంధు పథకం, సబ్సిడీపై యంత్ర పరికరాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ పూల రవీందర్, జేసీ నారాయణరెడ్డి, ఆర్డీవో, ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, జడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్యయాదవ్‌తో పాటు సర్పంచ్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

రైతుల్ని బలోపేతం చేస్తాం
*ప్రభుత్వ విప్ గొంగిడి సునీత
ఆలేరు, ఏప్రిల్ 26: రైతాంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆలేరు నియోజకవర్గ స్థాయి వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీలో భాగంగా 98 ట్రాక్టర్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడానికి యంత్ర పరికరాలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. యంత్ర పరికరాలతో సాగు వల్ల పెట్టుబడి గణనీయంగా తగ్గుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూసర్వే, రైతు బంధు పథకం ద్వారా రైతాంగానికి మరింత లబ్ధి చేకూరుతుందన్నారు. ఖరీఫ్ పంట పెట్టుబడి సాయాన్ని మే నెలలో రైతులకు అందజేస్తామని తెలిపారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటుచేస్తామన్నారు. ట్రాక్టర్ల పంపిణీలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ కాలె సుమలత, జడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, మార్కెట్ వైస్ చైర్మన్ నాయిని రామచంద్రారెడ్డి, ఆల్డా చైర్మన్ మోతె పిచ్చిరెడ్డి, ఎనిమిది మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, రైతు సమన్వయ సమితి కన్వీనర్లు, నార్మాక్స్ డైరెక్టర్లు, వ్యవసాయ శాఖ మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి నృసింహుడి జయంతి ఉత్సవాలు
యాదగిరిగుట్ట, ఏప్రిల్ 26: యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి దేవస్థానంలో నేటి నుంచి మూడు రోజుల పాటు స్వామి వారి జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ఈవో గీత తెలిపారు. 27న శుక్రవారం ఉదయం స్వస్తి వాచనం, విశే్వశ్వారాధన, పుణ్యహవాచనం, రుత్విక్ వరుణం, రక్షా బంధనం, లక్ష కుంకుమార్చన, శ్రీ వేంకటపతి అలంకరణ సేవ, సాయంత్రం మత్య్స గ్రహణం, అంకురారోహణం, మూర్తికుంభ స్థాపన, మూలమంత్ర హావనం, నీరాజన మంత్ర పుష్పములు, గరుడ వాహన అలంకార సేవ, 28న శనివారం ఉదయం మూలమంత్ర జపములు, పారాయణములు, లక్ష పుష్పార్చన, మంగళ నీరాజనం, మంత్ర పుష్పములు, సాయంత్రం మూలమంత్ర జపములు, నీరాజన మంత్రపుష్పములు, హనుమంత అలంకార సేవ, 29న మూలమంత్ర జపములు, మహాపూర్ణాహుతి, సహస్త్ర కలశాభిషేకం, సాయంత్రం శ్రీ నృసింహ జయంతి, తిరువారాధన, చతుర్విద పారాయణములు, ఆవిర్భావ ప్రవచనములు జరుగుతాయని వెల్లడించారు.