నల్గొండ

రైతుబంధు పెట్టుబడితో రైతుల్లో చెరగని ముద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్యాల, మే 17: రైతాంగం సంక్షేమం కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో కృషిచేస్తుందనడానికి రైతుబంధు పథకంతో పంటపెట్టుబడి చెక్కులు పంపిణీ చేయడమేనని రైతుబంధు పథకం పంటపెట్టుబడితో రైతుల్లో చెరగని ముద్ర అని శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. రైతుబంధు పథకంలో పంటపెట్టుబడి చెక్కులు, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి గురువారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరైనారు. చిట్యాల తహశీల్దార్ సిహెచ్. విశాలాక్షి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ వ్వవసాయాన్ని సాగుచేసుకునేందుకు ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న రైతాంగానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రైతుబాంధవుడిగా పంటపెట్టుబడినందించే రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ. 4000లు, ఏడాదికి రెండు పంటలకు రూ. 8000లను అందించడం ఎంతో గర్వకారణమన్నారు. దేశంలోని ఏరాష్ట్రం ఏ ప్రభుత్వం అమలు చేసిన విధంగా సాహసోపేతమైన నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ తీసుకుని రైతులకు పంట పెట్టుబడిని అందిస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి రైతుల సంక్షేమానికి పాటుపడుతున్నదని వ్యవసాయాన్ని ప్రోత్సహించి రైతుల ఆర్ధిక ప్రయోజనాలను పందేటందుకు వ్యవసాయాన్ని పండగలా చేసుకునేలా సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషిచేస్తున్నారన్నారు. భూముల వివరాలు రెవెన్యూ రికార్డుల్లో అస్తవ్యస్తంగా ఉన్నాయని భూరికార్డుల ప్రక్షాళన చేసినట్లయితే భూముల వివరాలు రికార్డుల మార్పుతో సాధ్యని రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ దేశంలో ఏ ప్రభుత్వం సాహసించని విధంగా 100రోజుల్లో భూరికార్డుల ప్రక్షాళనను తెలంగాణ ప్రభుత్వం సాధ్యచేసిందన్నారు. దేశంలోని రాష్ట్రాల ప్రభుత్వాలు భూరికార్డుల ప్రక్షాళనజోలికి వెళ్ళేందుకు భయపడిపోయాయని గుజరాత్‌లో సగంలోనే నిలిపివేశారని భూరికార్డుల ప్రక్షాళన చేసపట్టి దిగ్విజయంగా పూర్తిచేసిన ఘనత తెలంగాణరాష్ట్రంకు, సీఎం కేసీఆర్‌కు దక్కిందన్నారు. వ్యవసాయాన్ని సాగుచేసేకునై రైతుకు పంట పెట్టుబడినందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని రైతులకు పంట పెట్టుబడినందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని గుంట భూమి ఉన్న రైతులకు కూడా పంట పెట్టుబడినందించలని సీఎ కేసీఆర్ ఆదేశించారన్నారు. రాష్ట్రంలో కోటి 48లక్షల భూమికి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా రైతులకు అందజేస్తుందన్నారు. రాష్ట్రంలోని రైతాంగం సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని రైతుల సంక్షేమం కోసం రైతు సమన్వయ సమితీలను ఏర్పాటు చేసిందన్నారు. పండించిన పంటకు గుట్టుబాటు ధర వచ్చేలా రైతులకు లబ్దిచేకూరేలా సమితీలు కృషిచేస్తాయని రైతులు పండించిన పంటలకు ధర నిర్ణయించేస్థాయికి ఎదగాలని కోరారు. రైతులు పంట పెట్టుబడిని సద్వినియోగం చేసుకోవాలని రెండవ విడత పెట్టుబడి దీపావళి పర్వదినం సమయంలో ప్రభుత్వం పెట్టుబడినందించనున్నదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బట్టు అరుణఅయిలేష్, జెడ్పీటీసీ శేపూరి రవీందర్, సర్పంచ్ మద్దెల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.