నల్గొండ

జోరుగా వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మే 6: ఉపరిత అవర్తనం..అల్పపీడిన ప్రభావాలతో గత రెండు మూడు రోజులుగా జిల్లాలో పడుతున్న వర్షాలు జోరందుకున్నాయి. శుక్రవారం ఉదయం జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో పిడుగులతో భారీ వర్షాలు కురిశాయి. జిల్లాలోని అన్ని మండలాల్లో వర్షాలు పడగా జిల్లా వ్యాప్తంగా 29.6మిల్లిమీటర్ల వర్షాపాతం నమోదైంది. అత్యధికంగా వలిగొండ మండలంలో 78.2మిల్లిమీటర్ల వర్షాపాతం నమోదవ్వగా, చివ్వెంలలో 72.2, మోతేలో71.4, పోచంపల్లిలో 62.4, సూర్యాపేటలో 58.8మిల్లిమీటర్ల వర్షాపాతం నమోదైంది. ఈదురు గాలుల వర్షాలతో మామిడి, నిమ్మ తోటల కాయలు రాలిపోగా మార్కెట్ యార్డుల్లో, ఐకెపి కేంద్రాల్లో ఉన్న ధాన్యం కుప్పలు, బస్తాలు తడిసిపోయాయి. పలు గ్రామాల్లో ఇళ్ల రేకుల కప్పులు, దుకాణాల బోర్డులు ఎగిరిపోగా, చెట్లు విరిగిపడ్డాయి. చిలుకూరు-కోదాడ మార్గంలో చెట్లు విరిగి రోడ్డుపై పడ్డాయి. మేళ్లచెర్వు మండలం మల్లారెడ్డి గూడెం గ్రామంలో పిడుగు పడటంతో బూక్యాదేవి, భూలక్ష్మి, అచ్చయ్యలకు స్వల్ప గాయాల్యయి. గుర్రంపోడు మండలం కోతులపురం పిడుగు పడి రెండు పశువులు, తుర్కపల్లి మండలం వేములతండాలో పాడి ఆవు, ఆత్మకూర్(ఎస్) మండలం తెట్టెకుంట తండాలో పాడి గేదె మృతి చెందాయి. ఈదురుగాలులకు నెమ్మికల్‌లో ఫంక్షన్ రేకులు పూర్తిగా ఎగిరిపోయాయి. త్రిపురారంలో ఓ ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయి 150బస్తాల సిమెంట్ తడిసి 70వేల నష్టం జరిగింది. హుజూర్‌నగర్‌లో రైస్‌మిల్ ఎలివేటర్లు ఎగిరిపడి, రేకులు ఎగిరిపోయి బియ్యం తడిసి 10లక్షల మేరకు ఆస్తినష్టం జరిగింది. అటు తాజా వర్షాలతో చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరడంతో జిల్లాలో రెండో విడత ముమ్మరంగా సాగుతున్న మిషన్ కాకతీయ పనులకు ఆటంకం ఏర్పడింది. పూడిక మట్టి తీస్తున్న చెరువుల్లోకి వర్షపునీరు చేరడంతో యంత్రాలతో పనులు కొనసాగించలేక పనులు తాత్కాలికంగా నిలిపివేశారు.
వలిగొండ మండలంలో దెబ్మతిన్న రైల్వే ట్రాక్
వలిగొండ మండలంలో శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం వరద నీటి ఉదృతికి బీబీనగర్-నడికుడి రైలు మార్గంలో టేకుల సోమారం వద్ధ నిర్మాణంలో ఉన్న కల్వర్టు దెబ్బతిని పట్టాల కింద కంకర, మట్టి కొట్టుకపోయింది. అటుగా వెలుతున్న స్థానిక రైతులు వరద నీటితో ట్రాక్ దెబ్బతిన్న సమాచార్ని ట్రాక్ వాచ్‌మెన్‌కు అందించగా వాచ్‌మెన్ అదే సమయంలో సికింద్రాబాద్‌కు వెలుతున్న డెల్టాను కల్వర్టుకు కొద్ధి దూరంలోనే నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది.
అన్ని మండలాల్లో వర్షాలు
జిల్లాలోని అన్ని మండలాల్లో శుక్రవారం వర్షాలు కురిశాయి. జిల్లా వ్యాప్తంగా 29.6మిల్లిమీటర్ల వర్షాపాత నమోదవ్వగా సూర్యాపేట డివిజన్ పరిధిలో 506మిల్లిమీటర్లు, భువనగిరి డివిజన్‌లో 444మిల్లిమీటర్లు, మిర్యాలగూడ డివిజన్‌లో 292.8, నల్లగొండ డివిజన్‌లో 367.4, దేవరకొండ డివిజన్‌లో 133.8మిల్లిమీటర్ల వర్షాపాతం నమోదైంది. వలిగొండ మండలంలో 78.2, చివ్వెంలలో 72.4, మెతేలో 71.4, పోచంపల్లిలో 62.4, సూర్యాపేటలో 58.8, మునగాల, నడిగూడెంలలో 50.2, పెన్‌పహడ్‌లో 33.2, చౌటుప్పల్‌లో 45.8, శాలిగౌరారంలో 41.8, కట్టంగూర్‌లో 31.4, ఆత్మకూర్(ఎస్)లో ఆలేరులో 30.0, భువనగిరిలో 38.2, రామన్నపేటలో 31.4, హాలియా 31.2, మిర్యాలగూడలో 39.4, నల్లొగండలో 29.0, దేవరకొండలో 24.8మిల్లిమీటర్ల వర్షాపాతం నమోదైంది. ఇతర మండలాల్లోనూ 10నుండి 30మిలిమీటర్ల మధ్య వర్షాపాతం నమోదైంది.
తడిసిన ధాన్యం .. దెబ్బతిన్న పండ్ల తోటలు
నకిరేకల్: మండలకేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో బుధ, గురువారాలలో కురిసిన అకాల వర్షాలకు వరి ధాన్యం నీట మునిగింది. పలు గ్రామాలలో నిమ్మ, మామిడి, బత్తాయి తోటలలో కాయలు రాలి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అసలే కరువు కాటకాలతో నీరు లేక నానా ఇబ్బందులు పడిపంటలను సాగు చేయగా చేతికొచ్చిన పంటలు అకాల వర్షాలతో నీట మునగడంతో రైతులు తీవ్ర మనోవేధనకు గురవుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న వరి ధాన్యం వర్షపు నీటికి కొట్టుకుపోయింది. పలు చోట్ల నిమ్మ, మామిడి కాయలు రాలిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అదే విధంగా ఈదురు గాలులకు పలు చోట్ల ఇండ్లపై ఉన్న రేకులు లేచిపోయి ధ్వంసమై భారీ నష్టాన్ని మిగిల్చింది. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.
నేలరాలిన మామిడికాయలు
నడిగూడెం: మండలంలో శుక్రవారం వీచిన ఈదురు గాలులకు మామిడితోటలకు నష్టం వాటిల్లింది. కోతదశకు చేరిన మామిడికాయలు నేల రాలడంతో రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈదురుగాలులు తీవ్రంగా రావడంతో మండలపరిధిలోని వల్లాపురం, త్రిపురవరం, రామాపురం, శ్రీరంగాపురం గ్రామాల్లో మామిడితోటలకు నష్టం వాటిల్లింది. మామిడికాయలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేలు పరిహారం అందజేయాలని రైతుసంఘం డివిజన్ కార్యదర్శి ఏనుగుల వీరాంజనేయులు ఒక ప్రకటనలో కోరారు.
జలమయమైన రోడ్లు
తిరుమలగిరి: భారీగా ఈదురుగాలులు, వర్షం కురవడంతో గురువారం రాత్రి మండలకేంద్రంలో రోడ్లు నీటితో నిండిపోయాయి. స్థానిక క్రాస్‌రోడ్డు ఏరియాలో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు, పాదచారులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. భారీగా వీచిన ఈదురుగాలులకు స్థానిక సుందరయ్య కాలనీలో ఇండ్ల రేకులు ఎగిరిపడ్డాయి. అలాగే తొండ, జలాల్‌పురం, మామిడిపల్లి, ఈటూరు తదితర గ్రామాల్లో ఈదురుగాలులకు మామిడి, నిమ్మ తోటల్లో కాయాలు నేలరాలాయి. ఈదురుగాలులు, వర్షానికి ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
నేల కూలిన ఇళ్లు
చిలుకూరు: మండలవ్యాప్తంగా శుక్రవారం ఉదయం భారీ ఈదురుగాలులతో వర్షం భారీగా కురిసింది. భారీగా గాలులు వీచడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. గ్రామాల్లో వర్షపు నీటితో వీధులన్ని బురద మయంగా మారాయి. పల్లపు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. చెట్లు, విద్యుత్ స్తంబాలు కూలిపోయాయి. మండలంలోని ఆర్లెగూడెం గ్రామంలో బత్తుల యాలాద్రమ్మ, బేతవోలులో నెమ్మాది మరియమ్మ ఇండ్లు పూర్తిగా నేలకూలాయి. ఉదయం వేల కావడంతో ప్రాణ నష్టం జరగలేదు. 20.2మిలిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. కూలిపోయిన ఇండ్లకు, మామిడి తోటలకు నష్టపరిహారం చెల్లించాలని అధికారులను కోరుతున్నారు.
ఊరటనిచ్చిన వర్షం
మఠంపల్లి: గత నెల రోజులుగా నీటి ఎద్దడితో అల్లాడిన మండల ప్రజలకు కొంత ఊరట లభించింది. ముఖ్యంగా అటవి ప్రాంతాలలో, వ్యవసాయ భూములలో కొంతమేర నీరు నిల్వ చేరడంతో పశువులకు నీటి ఎద్దడి సమస్యం కొంతమేర తగ్గింది.