నల్గొండ

యాదాద్రిలో నిత్యోత్సవ.. ప్రత్యేక సేవా వైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, మే 22: పంచనారసింహ క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదగిరి శ్రీలక్ష్మీనరసింహ్మస్వామి వారి ఆలయంలో మంగళవారం నిత్యపూజలు, భక్తుల అర్జిత సేవలు సాంప్రదాయతీరిలో నిర్వహించారు. సుప్రభాతంతో ఆలయ కార్యక్రమాలను ప్రారంభించారు. ముందుగా ప్రతిష్టామూర్తులకు పూజలు నిర్వహించిన పూజారులు స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పంచామృతంతో అభిషేకించి తులసీదళాలతో అర్చించారు. వివిధ రకాల పుష్పాలతో పట్టువస్త్రాలతో స్వామి, అమ్మవార్లను అత్యంత సుందరంగా అలంకరించారు. కవచమూర్తులను స్వర్ణపుష్పాలతో కొలిచారు. ఆలయ మహా మండపంలో వేదపండితులు, అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవాన్ని పంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. ముందుగా ఆలయంలో స్వామివారి ఎదుట యాజ్ఞికులు శ్రీసుదర్శన నారసింహ్మ హోమం జరిపారు. కల్యాణోత్సవానికి ముందు స్వామి, అమ్మవార్లను గజవాహనంపై అధిష్ఠింపజేసి సేవ ఉత్సవాన్ని నిర్వహించారు. బాలాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన అష్టోతరం, సహస్రనామార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం వెండి జోడి సేవ ఉత్సవాన్ని నిర్వహించారు.
ఆంజనేయుడికి ఆకుపూజ
యాదగిరి శ్రీలక్ష్మినరసింహ్మస్వామి క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయస్వామి వారికి మంగళవారం ఉదయం మన్యుసూక్తంతో, పంచామృతాలతో అభిషేకం జరిపి చందనలేపం అద్దారు. అనంతరం స్వామివారికి తమలపాకుల మాల, వివిధ రకాల పుష్పాలతో అలంకరించి మంగళహారతి ఇచ్చారు. తమలపాకులతో సహస్రనామార్చన చేసిన అనంతరం నివేదన, మంత్రపుష్పం నిర్వహించి అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
స్వామి సేవలో ప్రముఖులు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహ్మస్వామి వారి దైవ దర్శనార్థం మంగళవారం యాదగిరిగుట్టకు హోంశాఖ జాయింట్ సెక్రటరీ ఎం.చంపాలాల్, రిటైర్డు ఐ ఏ ఎస్ అధికారి ఎంజి.గోపాల్ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.