నల్గొండ

రంజాన్ మాసంలో ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, మే 22: పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కార్యాలయ సమావేశ మందిరంలో రంజాన్ మాస ఏర్పాట్లపై ఏఎస్పీ, డీఎస్పీ, ఆర్డీవోలు, మున్సిపల్, విద్యుత్, మంచినీటి విభాగం అధికారులు, ముస్లిం మతపెద్దలు, పార్టీల ప్రతినిధులతో శాంతి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసంలో మసీదులలో సౌకర్యాలు కల్పిస్తామని, తాగునీరు, పారిశుధ్య సౌకర్యం కల్పిస్తామని, మసీదుల్లో రిపేర్లకు గానూ ప్రభుత్వం రూ.15లక్షలు మంజూరు చేసిందని, విద్యుత్, తాగునీటి సమస్యలపై ప్రజారోగ్య, మున్సిపల్ అధికారులతో చర్చించి ఆదేశాలు జారీ చేస్తామన్నారు. చక్కెర, ఎల్‌పిజి గ్యాస్ సరఫరా చర్యలు జేసి, డీఎస్‌వో తీసుకోవాలన్నారు. మున్సిపల్ కమిషనర్, డీఎస్పీ, ఆర్డీవోలు మసీదుల వారీగా కావాల్సిన ఏర్పాట్లపై దృష్టి సారించాలన్నారు. మున్సిపాలిటీలో తాగునీటి సరఫరాను మెరుగుపర్చేందుకు మూడు కొత్త మోటార్లను ఏర్పాటు చేశామన్నారు. పండగ సందర్భంగా బట్టల పంపిణీ, గిఫ్టు ప్యాకెట్లు, అవసరమైతే అదనంగా ప్రభుత్వం నుంచి సరఫరాకు కృషి చేస్తామని తెలిపారు. ఇఫ్తార్, నగర కమాన్‌లలో విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా ఉండాలన్నారు. పందులు, కుక్కల బెడదను నిర్మూలించేందుకు ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్, డీఎస్పీ, సంబంధిత అధికారులు సమావేశం నిర్వహించి చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ పార్టీల నాయకులు, మతపెద్దలు సూచించిన సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకొని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఏఎస్పీ పద్మనాభరెడ్డి, డీఆర్‌వో ఖిమ్యానాయక్, డీఎస్పీ సుధాకర్, మైనార్టీ సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు వెంకటాచారి, జగన్నాధరావు, లింగ్యానాయక్, ఆయా పార్టీల నాయకులు సయ్యద్‌పాష, సయ్యద్ అన్వర్, ముస్లిం మతపెద్దలు అసదుల్లా తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధిలో పేట జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం

* ఉద్యోగులకు కలెక్టర్ సురేంద్ర మోహన్ పిలుపు
సూర్యాపేట, మే 22: ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా అమలు చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన రితీలో సేవలు అందించి సూర్యాపేట జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వ ఉద్యోగులందరూ సమిష్టిగా కృషిచేయాలని జిల్లా కలెక్టర్ కె.సురేంద్రమోహన్ పిలుపునిచ్చారు. కేసీఆర్ కిట్ల పథకం అమలులో రాష్ట్రంలోనే ప్రధమస్ధానంలో నిలిచి తెలంగాణ ఎక్స్‌లేన్సీ-2018 అవార్డు అందుకున్న కలెక్టర్‌ను మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారి పబ్బతిరెడ్డి యాదిరెడ్డితో పాటు పలు శాఖల అధికారులు కలిసి పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అధికారులు, ఉద్యోగుల కృషి సహాయసహకారాల వల్లే తనకు ప్రతిష్టత్మకమైన ఈ అవార్డు దక్కిందన్నారు.
ఈ అవార్డు అందుకోవడం చాల సంతోషాన్ని కలిగించడంతో పాటు తన బాధ్యతలను మరింత పెంచిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ అంకితభావంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించి ప్రజల్లో ప్రభుత్వ సేవలపట్ల సంతృప్తి కలిగించినప్పుడే సార్ధకత చేకూరినట్లు అవుతుందన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి పబ్బతిరెడ్డి యాదిరెడ్డి మాట్లాడుతూ విధి నిర్వహణ పట్ల ఎంతో నిబద్ధత కలిగిన కలెక్టర్ సురేంద్ర మోహన్‌కు అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు. సూర్యాపేట ఆర్డీవో ఎస్.మోహన్‌రావు, సమాచార శాఖ సహాయ సంచాలకులు జి.ప్రసాదరావు, కలెక్టరేట్ పాలన అధికారి ప్రద్యామ్నా, డీటీడీవో సంజీవరావులతో పాటు పలు శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.