నల్గొండ

రెడ్ల సంక్షేమానికి ప్రత్యేక నిధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగిరి, మే 26: ప్రభుత్వం రెడ్ల సంక్షేమానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి పేద రెడ్డి కులస్థులకు అండగా, తదితర సమస్యల పరిష్కారం కోసం ఛలో హైదరాబాద్ పేరుతో ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించనున్న రెడ్ల సమరభేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని నల్లగొండ జిల్లా రెడ్డి జేఏసీ పిలుపునిచ్చింది. శనివారం స్థానిక చినవెంకట్‌రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోఅంతర్జాతీయ ఉపాధ్యాయుల సంఘం కార్యదర్శి ఎం.వి.గోనారెడ్డి, ప్రముఖ విద్యావేత్త, శాంతి సంఘం నాయకులు కొండకింది చినవెంకట్‌రెడ్డి, వల్లపురెడ్డి కోటిరెడ్డిలు మాట్లాడుతూ చట్టబద్దతతో కూడిన ప్రత్యేక నిధులతో రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని, నిరుపేద రెడ్డి విద్యార్థులకు ప్రత్యేక గురుకులాలు, స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయాలని, పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉన్నత విద్య కోసం విదేశీ విద్యానిధి పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగాల్లో వయోపరిమితి, అర్హత మార్కులను సడలించి అర్హులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయరంగానికి అనుసంధానిస్తూ రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు 50 సంవత్సరాలు నిండిన రైతులకు అన్నదాత పేరుతో నెలకు రూ.3వేల గౌరవ పింఛన్ అందించాలన్నారు. అంతేకాకుండా ప్రమాదవశాత్తు మరణించిన రైతుల కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, రైతు సంక్షేమ ఆరోగ్య పథకాలు, స్వయం ఉపాధి రంగాలకు ప్రభుత్వమే ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ఈకార్యక్రమంలో నాయకులు దామోదర్‌రెడ్డి, మారం సంతోష్‌రెడ్డి, యానాల ప్రభాకర్‌రెడ్డి, రావుల శ్రీనివాస్‌రెడ్డి, కవిత, నాగమణిరెడ్డి, గంట్ల అనంతరెడ్డి, బుచ్చిరెడ్డి, కూతురు సత్యవతి, తదితరులు పాల్గొన్నారు.
వడదెబ్బతో వ్యక్తి మృతి
అనంతగిరి, మే 26: వడదెబ్బతో వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలపరిధిలోని మొగలాయికోట గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. బంధువులు, భార్య మంగమ్మ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ములక్కలపల్లి నాగయ్య (70) రోజు మాదిరిగా తన పొలంలో పని చేస్తుండగా ఎండల తీవ్రతకు తట్టుకోలేక తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందినట్లు తెలిపారు.