నల్గొండ

పేటలో కాంగ్రెస్ ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, మే 26: ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ అధికారం చేపట్టి నాలుగేళ్ల పాలనకు వ్యతిరేఖంగా ఎఐసీసీ పిలుపుమేరకు విశ్వాస్‌ఘాత్ దివస్ నిరసనలో భాగంగా పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం జిల్లాకేంద్రంలోని కొత్తబస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించి ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈసందర్భంగా డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తండు శ్రీనివాస్‌యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు, గోపగాని వెంకటనారాయణగౌడ్‌లు మాట్లాడుతూ మోదీ ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చకుండా ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా పరిపాలనను కొనసాగిస్తున్నాడని విమర్శించారు. ప్రజలకు సేవ చేయాల్సిన ప్రధాని కార్పోరేట్ శక్తులకు తొత్తుగా మారి ప్రజలకు ఇబ్బందులు కలిగించే నిర్ణయాలు తీసుకున్నాడన్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో పెట్రోల్, డీజీల్ ధరల పెరుగుదలకు అడ్డుఅదుపు లేకుండా పోయిందని ఫలితంగా అన్నివర్గాల ప్రజలపై భారం పడుతుందన్నారు. నోట్ల రద్థుతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, జీఎస్‌టీ పేరుతో పేద ప్రజలపై భారాలు మోపి నడ్డి విరిచారని ఆరోపించారు. ప్రజావిశ్వాసం కోల్పోయిన ప్రధానమంత్రి తక్షణమే గద్దెదిగాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎలిమినేటి రమేష్, చిలుముల సునీల్‌రెడ్డి, యూత్‌కాంగ్రెస్ నల్లగొండ పార్లమెంట్ అధ్యక్షులు కుమ్మరికుంట్ల వేణుగోపాల్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు వీరన్ననాయక్, ఎడ్ల వీరమళ్లు, కౌన్సిలర్లు వల్థాస్ దేవేందర్, గోగుల రమేష్, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ ఈదా ప్రవీణ్, మహిళ కాంగ్రెస్ నాయకురాళ్లు సరస్వతిభట్ల అన్నపూర్ణ, గాజుల లక్ష్మి, నాయకులు కక్కిరేణి శ్రీనివాస్, గుంటి సైదులు, జహీర్, కుమ్మరికుంట్ల లింగయ్య, సాజిద్, బొక్కా ఉపేందర్‌రెడ్డి, నరెడ్ల సోమయ్య, ఆలేటి మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.