నల్గొండ

జిల్లా అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మే 26: నల్లగొండ జిల్లా అభివృద్ధి, రాజకీయ పరిస్థితులపై రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారకరామారావు శనివారం హైదరాబాద్‌లో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సమీక్షించారు. జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, బడుగుల లింగయ్య యాదవ్‌లు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నల్లగొండ మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులతో పాటు జిల్లాలోని వివిధ పథకాల పురోగతిని ఆయన సమీక్షించారు. జిల్లాలో పార్టీ స్థితిగతులపై, పంచాయతీ ఎన్నికలను ఎదుర్కోవడంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే వేముల వీరేశం, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, నల్లగొండ నియోజకవర్గ ఇంచార్జీ కంచర్ల భూపాల్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ కరీంపాష, నాయకులు అభిమన్యు శ్రీనివాస్, అబ్బగాని రమేష్, పాల్గొన్నారు.

బీబీనగర్‌లో కేంద్ర బృందం పర్యటన
బీబీనగర్, మే 26: మండలంలోని వివిధ గ్రామాల్లో 2008 నుండి 2018 వరకు జరిగిన బీఆర్‌జీఎఫ్ నిధులతో చేపట్టిన పనులను కేంద్ర మంత్రిత్వ శాఖ అధికారి జోసెఫ్‌నూరజ్ తులసి సందర్శించి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు కేంద్రం కేటాయించిన నిధులు దుర్వినియోగం కాకుండా అభివృద్ధి ఎలా జరిగిందని పరిశీలించారు. అనంతరం మిగితా పనుల కోసం కేంద్రం బీఆర్‌జీఎఫ్ నిధులు కేటాయించేందుకే ఈ పరిశీలన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట నల్లగొండ జిల్లా సీనియర్ అసిస్టెంట్ పద్మనాభం, ఎంపీడీవో శ్రీవాణి, పంచాయితీరాజ్ ఏఈ శివప్రసాద్, పంచాయితీ కార్యదర్శి సలీమ్ తదితరులు పాల్గొన్నారు.