నల్గొండ

అక్రమ రవాణాకు అడ్డుకట్ట.. ధరల నియంత్రణే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, జూన్ 18: వినియోగదారులకు మేలు చేసేందుకు, అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం సాండ్ టాక్సీ విధానాన్ని ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ ఎ.వి.రంగనాథ్‌లు అన్నారు. సోమవారం నల్లగొండ మండలంలోని నర్సింగ్‌భట్ల గ్రామంలో సాండ్ టాక్సీ ద్వారా ఆన్‌లైన్‌లో ఇసుక పొందే విధానాన్ని స్థానిక సర్పంచ్ మహ్మద్ జకీరా తాజొద్దిన్, ఎంపీటీసీ బడుపుల శంకర్‌లతో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో సాండ్ ట్యాక్సీ విధానాన్ని అమలు చేయడంలో కాస్త ఆలస్యం జరిగిందని, ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి వినియోగదారులు ఆన్‌లైన్ ద్వారా ఇసుకను పొందుటకు సాండ్ టాక్సీని జిల్లాలో ప్రారంభించామన్నారు. ఇతర జిల్లాల్లో ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని, అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పీడి యాక్టును ప్రయోగిస్తామన్నారు. ట్రాక్టర్ యజమానులు ఈ నూతన విధానానికి సహకరించాలని అన్నారు. సీ ఎం కేసీ ఆర్, జిల్లా మంత్రి జగదీష్ ఆదేశాలను అనుసరించి ప్రభుత్వ పాలసీని అమలు చేస్తున్నామని, తద్వారా వినియోగదారులు తక్కువ ధరకే ఇసుక పొందడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందన్నారు. గద్వాల, మహబూబ్‌నగర్, పెద్దపల్లి, తదితర జిల్లాల్లో సాండ్ టాక్సీ విధానం అమలు జరుగుతోందని తెలిపారు. మాజీ క్రికెటర్ నవజ్యోత్‌సింగ్ సిద్దు సైతం తెలంగాణ ప్రభుత్వ సాండ్ విధానాన్ని అభినంధించారని గుర్తు చేశారు. పోలీసు, రెవెన్యూ, మైనింగ్ శాఖల సమన్వయంతో సక్రమంగా ఇసుక రవాణా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. నర్సింగ్‌భట్లలో 137 రిజిష్టర్ సాండ్ టాక్సీలు ఉన్నాయని పేర్కొన్నారు. వెట్రోనిక్స్ ప్రాజెక్టు మేనేజర్ సాంబశివరావు మాట్లాడుతూ వినియోగదారులు ఇసుక పొందేందుకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సాండ్‌టాక్సీ.కామ్‌కు లాగిన్ అయి ఫోన్ నెంబర్, అడ్రస్ నమోదు చేసి ఇసుక ఎంత పరిమాణంలో కావాలో ఆర్డరు చేయాలన్నారు. ఇసుక పరిమాణానికి ప్రభుత్వం నిర్ణయించిన ధరను మీసేవ, ఆన్‌లైన్, క్రెడిట్, డెబిట్‌కార్డుల ద్వారా చెల్లించవచ్చని, తగిన రుసుం చెల్లించిన వెంటనే వినియోగదారుని సెల్ నెంబరుకు కన్ఫర్మేషన్ సందేశం అందుతుందని, వినియోగదారులు ఆర్డరు చేసిన స్థలానికి ఇసుక సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సుధాకర్, ఆర్డీవో వెంకటాచారి, మైనింగ్‌శాఖ ఏడీ సురేందర్, తదితరులు పాల్గొన్నారు.

పోలీసుల నిర్బంధ తనిఖీలు
కోదాడ, జూన్ 18: కోదాడ పట్టణంలోని చెరువుబజారులో సూర్యాపేట జిల్లా యస్‌పి ప్రకాష్ జాదవ్ పర్యవేక్షణలో 120 మంది పోలీసులు ఆదివారం రాత్రి రెండుగంటలపాటు కట్టడి, ముట్టడి నిర్వహించారు. రాత్రి తొమ్మిది గంటలనుండి 11 గంటలవరకు డియస్‌పి సుదర్శన్‌రెడ్డి, పట్టణ ఇన్సిపెక్టర్ శ్రీనివాసరెడ్డి, మరో ఇద్దరు సిఐలు, 10 మంది యస్‌ఐలు, సిబ్బంది చెరువుకట్ట బజారులో 350 ఇండ్లను తనిఖీ చేశారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో సరైన పత్రాలులేని 65 ద్విచక్రవాహనాలు, ఐదు ఆటోలు, ఒక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకొని ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొన్నట్లు ఈ సందర్భంగా జిల్లా యస్‌పి ప్రకాష్ జాదవ్ పత్రికలకు వెల్లడించారు. అనుమానితుల గుర్తింపు, అక్రమరవాణా, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రజలకు మెరుగైన రక్షణ కల్పించడం కొరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్‌ల పరిధిలో కార్డన్ అండ్ సెర్చ్‌ను నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కార్డన్ అండ్ సెర్చ్‌పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, పోలీసులు వచ్చి గుర్తింపుకార్డులు తనిఖీ చేయాలంటే ప్రజలు నిర్భయంగా తమ గుర్తింపుకార్డులను చూపించాలని ఆయన సూచించారు. కార్డన్ అండ్ సెర్చ్‌లో స్వాధీనం చేసుకొన్న వాహనాలకు సంబందించిన సరైన అనుమతి పత్రాలు చూపించి వాహనాలను తీసుకెళ్లవచ్చని ఆయన చెప్పారు. అక్రమ వ్యాపారాలకు, అక్రమ కార్యకలాపాలకు పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని యస్‌పి హెచ్చరించారు.