నల్గొండ

జైకేసారంలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలంటూ కాంగ్రెస్ రాస్తారోకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, జూన్ 18: అధికార పార్టీ నాయకుల వేధింపులకు జడిసి పారిపోయిన కాంట్రాక్టర్‌ను రప్పించి బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ జైకేసారం గ్రామ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం అర్థరాత్రి కారు ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయింది. అదృష్టవశాత్తు ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఉదయం స్పందించిన కాంగ్రెస్ నేతలు, ప్రజలు మండలంలోని జైకేసారం గ్రామంలో రహదారిపై జరుగుతున్న బ్రిడ్జిని వెంటనే నిర్మాణం చేసి ప్రయాణీకులను కాపాడాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాస్తారోకో నిర్వహించి నిరసనలు తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అధికార టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కమీషన్‌లకోసం కాంట్రాక్టర్‌ను వేధింపులకు గురిచేసారని విమర్శించారు. గత మూడు సంవత్సరాల క్రితం చౌటుప్పల్ నుంచి వలిగొండకు వెలుతున్న రహదారిపై జైకేసారం గ్రామం సమీపంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టారని తెలిపారు. సగం బ్రిడ్జిని నిర్మించిన తరువాత అధికారపార్టీ నేతలు తరుచూ కాంట్రాక్టర్‌ను కమీషన్‌లకోసం వేధింపులు చేశారని ఆరోపించారు. వేధింపులు తాళలేక పనులను విడిచిపెట్టి కాంట్రాక్టర్ వెల్లిపోయాడన్నారు. సగం పనులు చేయడం వల్ల రహదారిపై వెలుతున్న కారు రాత్రి కాలువలో పడిపోయిందిన్నారు. అనేక మంది ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని, బ్రిడ్జిని పూర్తిగా నిర్మించి ప్రజలకు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు కాసరబాధ నరహరి, ఉపసర్పంచ్ లింగాల సాలయ్య, నాయకులు తాటి రవి, జీండ్రు సంతోశ్‌రెడ్డి, నర్సింహ, గంగాధర్, శంకరాచారి, శ్రవణ్, వెంకటేశ్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.