నల్గొండ

వినతులపై తక్షణ స్పందన: కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగిరి, జూన్ 18: గ్రీవెన్స్‌డేలో ప్రజలు ఇచ్చిన సమస్యల వినతులపై అధికారులు తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై అందించిన వినతులను స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు వాటిని బదలాయించారు. ఈ సందర్భంగా నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంకు చెందిన కంచనపల్లి వెంకటరామనర్సమ్మ తన భర్త చనిపోయాక తన పెద్దకుమారుడు, చిన్నకోడలు ప్రభుత్వ ఉద్యోగులని తనను వారు పోషించకపోగా వేధింపులు చేస్తు పింఛన్ డబ్బులు సైతం తీసుకుని ఇంటి నుండి గెంటివేశారని తన పోషణకు వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతు వినతి పత్రం అందించారు. దామరచర్ల మండలం వాఛ్యతండాకు చెందిన లావోరి లక్కిసింగ్ తన ఐదెకరాల భూమికి చెందిన రైతుబంధు చెక్కు ఇవ్వకుండా విఆర్‌వో ఇబ్బంది పెడుతున్నాడంటు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తక్షణమే ఈ సమస్యలపై అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. పంచాయితీరాజ్ ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లను 54శాతంకు పెంచి ఏబిసిడి వర్గీకరణ అనుసరించాలంటు బిసి సంక్షేమ సంఘం నాయకులు దూదిమెట్ల సత్తయ్యియాదవ్, దూడుకు లక్ష్మినారాయణలు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతు ఆయన అధికారులతో మాట్లాడుతు రైతుబంధు, పాస్ పుస్తకాల పంపిణీ సమస్యలకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఆసరా పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల సమస్యలపై ఆయాశాఖల అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌వో ఖిమ్యానాయక్, జెసి సి.నారాయణరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.