నల్గొండ

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమలగిరి (సాగర్), జూన్ 18: రానున్న 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయలు రైతుల రుణమాఫీ చేస్తామని సీఎల్పీ నాయకులు కుందూరు జానారెడ్డి అన్నారు. సోమవారం తిరుమలగిరి మండల కేంద్రంలోని శ్రీనివాస ఫంక్షన్ హాలులో జరిగిన మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ముఖ్య అతిధిగా వచ్చిన ఆయన మాట్లాడుతూ మొదటిగా అల్వాల్ ఎక్స్ రోడ్డులోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి బైక్ ర్యాలీగా మండల కేంద్రానికి చేరుకున్నారు. మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల విగ్రహాలకు పూలమాలలు వేసి కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఫంక్షన్‌హాలులో జరిగిన సమావేశంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒకే సారి రుణమాఫీ ఉంటుందన్నారు. గిరిజనుల కోసం ప్రత్యేక పధకాన్ని ప్రవేశపెడ్తామన్నారు. ఎన్నికల జిమ్మిక్కుల కోసమే అధికార టీఆర్‌ఎస్ పార్టీ రైతు బంధు పధకాన్ని పెట్టిందే తప్ప రైతులపై ప్రేమతోకాదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంతో ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగునిచ్చిందని, ఆరోగ్యశ్రీ కంటే రైతు బంధు ఫధకం గొప్పది కాదన్నారు. నియోజకవర్గంలోని ప్రతి తండా, ప్రతి గ్రామం బీటీ రోడ్లు, విద్యుత్, సీసీ రోడ్లు, తాగు, సాగునీరు అందిస్తున్నారంటే అది తన వల్లేనని, ఎత్తిపోతల పథకాలు చేయించలేని అసమర్ధలు విమర్శించడమేమిటని ప్రశ్నించారు. నాగార్జునసాగర్‌లో టీఆర్‌ఎస్ జెండా ఎగురవేస్తామని ప్రగల్బాలు పలుకుతున్న అధికార పార్టీ నాయకుల కలలు కలలుగానే మిగులుతాయన్నారు. సాగర్‌లో తనకు ప్రజాబలం ఉందని, ఎదురులేదన్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ.్భగవాన్‌నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో యువజన కాంగ్రెస్ నాయకులు కే.రఘువీర్‌రెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, మండల పార్టీల అధ్యక్షులు కే.అంతయ్యయాదవ్, కే.వెంకట్‌రెడ్డి, మర్లచంద్రారెడ్డి, కార్యకర్తలు హాజరయ్యారు.