నల్గొండ

ఇంకేమైనా సమస్యలున్నాయా...?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జూన్ 18: రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సోమవారం మారుమూల గ్రామంలోని ప్రజలతో మమేకమయ్యారు. కాన్వాయ్‌లో వెళ్తూ గ్రామ చావిడి వద్ద ఉన్న మహిళలను చూసి ఆగి వారితో కలిసి కటికనేలపై కూర్చొని అప్యాయంగా పలకరిస్తూ ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ ఆరా తీశారు. సాక్ష్యాత్తూ రాష్ట్ర మంత్రే తమవద్దకు వచ్చి చేతిలో చేయివేసి పలకరించడంతో ఆ గ్రామస్థుల ఆనందానికి ఆవధులు లేకుండా పోయాయి. సోమవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం ఏపూర్ గ్రామంలో ఆవిష్కృతమైన ఈ సన్నివేశం గ్రామస్థులను ఆనంద డోలికల్లో ఊగించింది. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్న మంత్రి ఆత్మకూర్(ఎస్) మండలం బొప్పారం గ్రామంలో జరిగిన రామాలయ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తూ ఏపూర్ గ్రామంలోని గ్రామ చావిడి వద్ద గతంలో మంచినీటి కోసం మహిళలు తనను అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్న మంత్రి వెంటనే అక్కడ ఆగి నేలపై కూర్చుని ఉన్న మహిళల వద్దకు వెళ్లి వారి పక్కన తాను కటికనేలపైనే కూర్చుని ఆప్యాయంగా పలకరించారు. గతంలో నీళ్లు రావడం లేదని నన్ను అడ్డుకున్నారు.. బావి తవ్వించి పైపులైన్‌లు వేయించా.. ఇప్పుడు నీళ్లు వస్తున్నాయా? నీటికి ఏ ఇబ్బందులు లేవుగా అని ప్రశ్నించారు. నీళ్లు ఇప్పుడు బాగానే వస్తున్నాయని, ఇబ్బందులు లేకుండా చేశారని వారు చెప్పడంతో మంత్రి చిరునవ్వుతో సంతృప్తిని వ్యక్తపరిచారు. కరెంటు బాగా వస్తోందా.. రేషన్ బియ్యం ఇస్తున్నారా.. పింఛన్లు అందుతున్నాయా, ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు ఇస్తున్నారా అంటూ పలువురిని పలకరిస్తూ వారితో మమేకమై పలు పథకాల అమలును గూర్చి ఆరా తీశారు. తమ భూమికి పాసు పుస్తకం రాలేదని గ్రామంలోని ఓ మహిళ చెప్పడంతో రైతుబందు చెక్కు ఇచ్చారా, పాసు పుస్తకం కూడా ఇప్పిస్తానంటూ సమస్యను పరిష్కరించాలని అక్కడే ఉన్న రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పలు ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజలు సానుకూలంగా సమాధానం ఇవ్వడంతో మంత్రి ఆనందంతో అక్కడ నుంచి బయలుదేరారు. రాష్ట్ర మంత్రే స్వయంగా తమతో కలిసి కూర్చొని సమస్యలను అడిగి తెలుసుకోవాడాన్ని తాము జీవితంలో మరువలేమని గ్రామస్థులు చెబుతున్నారు.