నల్గొండ

మోటార్ల మరమ్మతుల్లో అవినీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోదాడ, జనవరి 2: కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని తాగునీటి బావులు, బోర్‌లకు సంబందించిన విద్యుత్ మోటార్‌ల మరమ్మతుల్లో అవకతవకలు జరిగినట్లు కోదాడ మున్సిపల్ ఛైర్‌పర్సన్ వంటిపులి అనిత ఆరోపించారు. కోదాడ మున్పిపాలిటీలో శనివారం ఆమె విలేఖరులతో మాట్లాడారు. మరమ్మత్తులు చేయకుండానే తొమ్మిది తాగునీటి బావులు, బోర్‌లకు సంబందించిన విద్యుత్ మోటార్లకు మరమ్మత్తులు చేసినట్లు 2.29 లక్షల రూపాయలను మున్సిపల్ డిఇకి తెలియకుండా డ్రా చేశారని ఆమె ఆరోపించారు. చెక్‌బుక్స్ ఇస్యూ రిజిస్టర్‌లో అక్టోబర్ ఖాళీగావుంచి నవంబర్ నెల ఎంట్రీలు చేశారని ఆమె చెప్పారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌లు కలకొండ శ్రీను, కుడుముల లక్ష్మినారాయణ, కాంగ్రెస్ నాయకులు సైదిబాబు, వేలాద్రి, షమ్మి, వంటిపులి నాగరాజు, ఉద్దండు తదితరులు పాల్గొన్నారు. కాగా మున్సిపల్ ఛైర్‌పర్సన్ అనిత ఆరోపణలను కమిషనర్ బాలోజీనాయక్ ఖండించారు. మోటార్ల మరమ్మతుల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. కౌన్సిల్ తీర్మాణంమేరకు బదిలీ అయిన డిఇ వున్నప్పుడే నిధులను మంజూరుచేసి యంబి చేసినట్లు ఆయన వివరించారు. మున్సిపల్ డిఇ లక్ష్మణ్ మాట్లాడుతూ తనకు తెలియకుండానే నిధుల డ్రా జరిగిందని, ఎఇకి మెమో జారీ చేస్తానని చెప్పారు.

సిఎం రిలీఫ్ చెక్ పంపిణీ

ఆత్మకూర్(ఎం), జనవరి 2: మండల కేంద్రానికి చెందిన కోరె మహేశ్‌కు సిఎం రిలీఫ్ కింద మంజూరైన 75వేల చెక్కును శనివారం ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట ఆత్మకూర్ ఉపసర్పంచ్ యాత కవిత, యాత రాధ వున్నారు.

కలెక్టర్‌ను అడ్డుకున్న అఖిలపక్ష నేతలు

రాజాపేట, జనవరి 2 : గత 10సంవత్సరాలుగా కరువుతో విలవిలలాడుతున్న రాజపేట మండలాన్ని కరవు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ శనివారం తహశిల్దార్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని బయటకు విచ్చేస్తున్న కలెక్టర్ సత్యనారాయణరెడ్డిని అఖిల పక్ష నాయకులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మండలాన్ని కరవు మండలంగా ప్రకటించాలని కోరుతూ నినాదాలు చేశారు. దాదాపు అరగంటపాటు కలెక్టర్ బయటకు వెల్లకుండా అడ్డుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి వారిని కలెక్టర్‌ను తప్పించారు. అంతకు ముందు నాయకులు తహశిల్దార్ బండా అరుణారెడ్డి పనితీరు బాగాలేదంటూ కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. అదేవిదంగా జాలాగ్రామంలో ఎస్సీ అసైన్డ్ భూములు రియల్ వ్యాపారులు దక్కించుకున్నారని మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసి ఎన్. రాజిరెడ్డి, ఎస్. వెంలటేశ్ గౌడ్, బాల్‌రెడ్డి, జి. మధు, మహేందర్ గౌడ్, ప్రవీణ్, జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.