నల్గొండ

మున్సిపాలిటీ ముందు ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, మే 9: నల్లగొండ పట్టణ శివారు విలీన గ్రామ పంచాయితీలలో డ్రైనేజి, రక్షిత మంచినీటి సమస్యలను పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ సమస్యలను పరిష్కరించాలని అసిస్టెంట్ కమీషనర్ అరుణాకుమారికి వినతి పత్రం అందించి మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లగొండ నుండి 600గ్రామాలకు నీరందిస్తూ నల్లగొండ శివారు ప్రాంతాలకు అందించక పోవడం సిగ్గుచేటన్నారు. డ్రైనేజీలలో మురికి పూడికలు తీయాలని, అవసరమైన చోట సైడ్ డ్రైన్స్ నిర్మించాలని డిమాండ్ చేశారు. మామిళ్లగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఫేజ్ 123లలో లబ్ధిదారులందరికి డబుల్‌బెండ్‌రూమ్ ఇండ్లను నిర్మించాలని డిమాండ్ చేశారు. వారం రోజులుగా సిపిఎం పట్టణంలో పర్యటనలు చేసి సమస్యలు పరిశీలిస్తున్నామన్నారు. మున్సిపల్ పాలకవర్గం స్పందించకుంటే కలెక్టరేట్ ముందు ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎండి సలీమ్, పట్టణ కార్యదర్శి సయ్యద్ హశం, వన్‌టౌన్, టూ టౌన్ కార్యదర్శులు దండెంపల్లి సత్తయ్య, వి.నారాయణరెడ్డి, దండెంపల్లి సరోజ, గాదె నర్సింహ్మ, తుమ్మల పద్మ, అద్దంకి నర్సింహ్మ, బోడ ఇస్తారి, మదుసుదన్‌రెడ్డి, వి.సత్తయ్య, గౌతమ్‌రెడ్డి, పల్లె పర్వతాలు, లక్ష్మీ, పద్మ తదితరులు పాల్గొన్నారు.