నల్గొండ

హరిత హారానికి ముందస్తు ప్రణాళికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేటటౌన్, జూన్ 19: నాలుగవ విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె.సురేంద్రమోహన్ ఆదేశించారు. మంగళవారం హరితహారం నాలుగవ విడుతపై రాష్ట్రప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, హరితహారం ప్రత్యేక అధికారి ప్రియాంక వర్గీస్, ఇతర శాఖల అధికారులతో కలిసి నాలుగవ విడుత హరితహారం కార్యక్రమంపై వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు నిర్వహించిన హరితహారం కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. నాలుగవ విడత హరితహారంలో అటవీశాఖ, జిల్లా గ్రామీణాభివృద్దిశాఖ 93 నర్సరీల్లో 1కోటి 53లక్షల మొక్కలను అందుబాటులో ఉంచామన్నారు. నాలుగవ విడత హరితహారంలో 1కోటి 30లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యం పెట్టుకున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులను అలాగే ప్రజలను మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలన్నారు. జిల్లాలో ముఖ్యంగా ఇంటికి ఆరు మొక్కలు అందించాలన్నారు. ముందుగా గ్రామ, మండల, జిల్లా స్థాయి సమావేశాలు ఏర్పాటుచేసి ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు. మండల, జిల్లాస్థాయి రైతుసమన్వయ సమితీ సభ్యులను హరితహారం కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలన్నారు. జిల్లాలోని మున్సిపాలిటీలకు అటవీశాఖ ద్వారా మొక్కలు అందించాలన్నారు. గత హరితహారంలో 3లక్షల ఈత మొక్కలు నాటామని నాలుగవ విడుతలో కూడా అనుకున్న లక్ష్యాన్ని పూర్తిచేయాలన్నారు. పదివేల సీడ్ బాల్స్‌ను గుట్టలు, రాతిప్రాంతాల్లో నాటాలని సూచించారు. గ్రామపంచాయితీలో ఏర్పాటుచేసే నర్సరీలకు నిధులు సమకూర్చడం జరుగుతుందన్నారు. జనగాం కొత్తరోడ్డులో జాతీయ రహదారిపై నాటిన విధంగా మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలని అందుకు అటవీ, పంచాయితీరాజ్‌శాఖ అధికారులు కొత్తరోడ్లను పరిశీలించాలన్నారు. ప్రభుత్వ భూములు, స్థలాలు, అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా మొక్కలు నాటాలని ఆదేశించారు. మొక్కల సంరక్షణ బాధ్యత గ్రామపంచాయితీల్లో సర్పంచ్‌పై ఉందన్నారు. ఈవీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్‌డీవో సుందరి కిరణ్‌కుమార్, డీఈవో చైతన్య జైనీ, ఎక్సైజ్ కమీషనర్ శ్రీనివాస్, ఎఫ్‌ఆర్‌వో వెంకటేశ్వర్లు, సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్ మున్సిపల్ కమీషన్‌లు పాల్గొన్నారు.