నల్గొండ

పింఛన్ కోసం లబ్ధిదారుల పడిగాపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూదాన్‌పోచంపల్లి, జూన్ 19: మండలకేంద్రంలో వేలిముద్రలు రాని పింఛన్‌దారులు గత పదిహేనురోజులుగా డబ్బులందక ఇబ్బందులు పడుతున్నారని జిల్లా కాంగ్రెస్ నాయకులు తడక వెంకటేశం ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక పోస్ట్ఫాసు వద్ద పింఛన్‌దారులను సమస్యలు అడిగి తెలసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్బులు పంచకుండా పోస్ట్ఫాసు సిబ్బంది ప్రతిరోజు వాయిదా వేస్తూ వృద్ధులు, వితంతువులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, 70 ఏళ్ల పైబడిన వృద్ధులు పోస్ట్ఫాసు వద్ద నిరీక్షిస్తున్నారని అన్నారు. ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్ శివకుమార్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గునిగంటి వెంకటేష్‌గౌడ్, నాయకులు సోను, శ్రీనివాస్, కృష్ణ, రాజ్‌కుమార్, శివ, కుమార్, పాండు, తదితరులు పాల్గొన్నారు.

మిమిక్రీ పితామహుడు వేణుమాధవ్
మృతికి సంతాపం
మోత్కూర్, జూన్ 19: భారత మిమిక్రీ పితామహుడు పద్మశ్రీ డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ్ మృతిపట్ల తెలుగుభాషా చైతన్య సమితి ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం సంతాపం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా వేణుమాధవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో తెలుగుభాషా చైతన్య సమితి జిల్లా అధ్యక్షుడు కోమటి మత్స్యగిరి, ప్రతినిధులు సీహెచ్.వెంకన్న, సీహెచ్.సోమేష్, ఎస్.మనోహర్, సీహెచ్.బాబుచారి, డి.నరేష్, కిరణ్, మహేష్, వెంకన్న, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి
మంజులారెడ్డికి సన్మానం
మోత్కూర్, జూన్ 19: ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ఉజ్వల యోజన పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మోత్కూర్ మండలంలో సుమారు 8 వందల మంది దళితులను లబ్దిదారులుగా చేర్పించినందుకు గానూ బీజేపీ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మంజులారెడ్డిని మంగళవారం హైదరాబాద్ నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరి, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్‌లు ఆమెను శాలువాలతో ఘనంగా సన్మానించారు. గ్రామీణ ప్రాంతం నుంచి పార్టీని బలోపేతం చేస్తున్న చాడ మంజులారెడ్డిని మంత్రి పురంధరేశ్వరి ఈసందర్భంగా అభినంధించారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఎ.విజయ, జిల్లా మోర్చా అధ్యక్షురాలు సంగీతారెడ్డి, యమునాపాఠక్, పద్మ, సుజాత, గౌసియాబేగం, మంగమ్మ పాల్గొన్నారు.