నల్గొండ

కఠినంగా పంచాయతీ ఎన్నికల నిబంధనల అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, జూన్ 19: త్వరలో జరుగబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ ఎన్నికల రిటర్నింగ్ స్టేజీ 1,2 అధికారులకు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. చౌటుప్పల్ మండలం లక్కారం శివారులోని జయశ్రీ గార్డెన్‌లో డివిజన్ పరిధిలోని ఎన్నికల అధికారులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పాల్గొన్న కలెక్టర్ అనితారామచంద్రం మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు పాటించడంలో అధికారులు నిర్లక్ష్యం చేయొద్దన్నారు. ఎక్కడ నిర్లక్ష్యం జరిగినా ఘర్షణలు జరిగే ప్రమాదం ఉంటుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే స్థానిక సంస్థల ఎన్నికలు హోరాహోరీగా జరుగుతాయన్నారు. చిన్నపాటి తప్పిదం జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. గ్రామస్థాయిలో జరిగే ఎన్నికలను ఓటర్లు, రాజకీయ పార్టీలు పటిష్టంగా తీసుకుంటారన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తినా పై అధికారుల దృష్టికి తీసుకువచ్చి వెంటనే పరిష్కారం చేసుకోవాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన ప్రత్యేక వాట్సాప్‌ను క్రియేట్ చేస్తున్నామన్నారు. ఎన్నికల నిర్వహణలో నెలకొనే సమస్యలను ఎప్పటికప్పుడు గ్రూప్‌లో పెట్టాలని సూచించారు. రిటర్నింగ్ స్టేజీ వన్ అధికారులను రంగారెడ్డి జిల్లా నుంచి పంపించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. గ్రామపంచాయతీ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు ఒక సవాల్‌గా తీసుకోని ముందుకు వెళ్లాలని సూచించారు.
ఎన్నికల నిబంధనల అమలులో ఎక్కడా రాజీపడొద్దన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో ఎస్.సూరజ్‌కుమార్, జిల్లా పంచాయతీ అధికారి పి.బిక్షం, మండల పరిషత్ అధికారులు గుమ్మి రజితారెడ్డి, సరస్వతి, విజయనాయక్, జానకిరెడ్డి, జి.నరేందర్‌రెడ్డి, ఎం.సాంబశివరావు, డి.అంజన్‌రెడ్డి, వి.వేణుగోపాల్‌రెడ్డి, మండల పరిషత్ సూపరిండెంట్‌లు, ఈవోపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

గ్రామ గ్రామాన టీడీపీ జెండావిష్కరణ
భూదాన్‌పోచంపల్లి, జూన్ 19: మండలంలోని జిగ్లక్‌పల్లి, దోవతిగూడెం, అంకమ్మగూడెం గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భువనగిరి నియోజకవర్గ ఇంచార్జీ కుందారపు కృష్ణమాచారి మంగళవారం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ టీ ఆర్ ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు టీడీపి విజయానికి సోపానమని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈకార్యక్రమంలో టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బడుగు దానయ్య, మండల కన్వీనర్ డి.వెంకటరమణారెడ్డి, కో కన్వీనర్ తుర్కంటి లక్ష్మారెడ్డి, బి.లక్ష్మయ్య, పట్టణ అధ్యక్షుడు గుండ్ల రామచంద్రం, నాయకులు యాదగిరి, మీసాల నర్సింహ్మ, పి.యాదయ్య, వెంకటాచారి, నరహరి, సత్తయ్య, చిట్టయ్య, తదితరులు పాల్గొన్నారు.
పెట్రోల్ బంకులో తనిఖీలు
మోత్కూర్, జూన్ 19: మండలకేంద్రంలోని శ్రీలక్ష్మీ ఫిల్లింగ్ స్టేషన్‌లో పెట్రోల్, డీజిల్ కల్తీ జరుగుతుందనే ఆరోపణలతో జేసీ ఆదేశాల మేరకు మంగళవారం సివిల్ సప్లయ్ ఏసీవో బ్రహ్మారావు, ఆర్ ఐ వెంకట్‌రెడ్డిలు బంకులో తనిఖీలు నిర్వహించారు. స్టాకు రిజిష్టర్ల్రను, మీటరు రీడింగ్‌లను పరిశీలించారు. పెట్రోల్, డీజిల్ నమూలను సేకరించి ల్యాబ్‌కు పంపించనున్నామని, ల్యాబ్ ద్వారా వచ్చిన రిపోర్టును బట్టి నిర్ణయం తీసుకోనున్నట్లు వారు తెలిపారు. వారి వెంట సివిల్ సప్లయ్ డిటి అంజనేయులు ఉన్నారు.