నల్గొండ

నిర్లక్ష్యాన్ని సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూన్ 19: జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సమావేశాల పట్ల జిల్లా అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిండాన్ని తాము సహించబోమని జిల్లా అధికాలు తప్పనిసరిగా స్థాయి సంఘాలకు హాజరుకావాలని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి హెచ్చరించారు. మంగళవారం జిల్లా పరిషత్‌లో నిర్వహించిన జడ్పీ మూడవ స్థాయి వ్యవసాయ సంఘం సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. సమావేశంలో కొన్ని శాఖల అధికారులు తమ శాఖల ప్రగతికి సంబంధించిన వివరాలను ఎజెండాలో పెట్టకపోవడంపై కర్నాటి మండిపడ్డారు. ఎజెండాలో అన్ని శాఖల వివరాలు విధిగా సమర్పించాలని లేనట్లయితే తమ పరిధిలో వీలైన చర్యలకు వెనుకాడబోమన్నారు. సబ్సిడీ గొర్రెలు, చేప పిల్లల పంపిణీ పురోగతిపై ఆయన అధికారులను నిలదీశారు. స్పందించిన జెడిఎ రమేశ్, చరితలు మాట్లాడుతు జిల్లాలో 62శాతం మేరకు 32వేల సబ్సిడీ గొర్రెల పంపిణీ జరిగిందని, రెండో విడతగా ఈ నెల 25నుండి మరో 20వేల గొర్రెల కొనుగోలు చేపట్టనున్నామన్నారు. చేప పిల్లల సైజ్ 750గ్రాముల వరకు ఉందని ఏడి చరిత సభ్యులకు వివరించగా తమ పరిశీలనలో కేవలం 400గ్రాములకు మంచి లేవంటు కర్నాటి అసంతృప్తి వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు గత మాసంతో పోల్చితే సగటున ఒక శాతం మేరకు తగ్గుముఖం పట్టాయన్నారు. యాసంగి ధాన్యం డబ్బుల చెల్లింపుల్లో జాప్యంపై సభ్యులు ప్రశ్నించగా సివిల్ సఫ్లయ్ అధికారులు మూడు జిల్లాల పరిధిలోని ధాన్యం డబ్బులు రైతులందరికి పూర్తి చేశామని, కేవలం ఖాతాలు, ఆధార్ నెంబర్లు సరిగా లేని రైతులకు మాత్రమే చెల్లింపులు ఆగాయన్నారు. జెడిఏ నరసింహరావు మాట్లాడుతు రైతుబంధు చెక్కులు, నూతన పాస్‌పుస్తకాల పంపిణీ పురోగతిని సభ్యులకు వివరించారు. ఖరీఫ్‌లో పంపిణీకి సిద్ధంగా ఉన్న ఎరువులు, విత్తనాల వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో హనుమానాయక్, సభ్యులు పి.కోటేశ్వర్‌రావు, గాలి రవికుమార్, కె.కమలమ్మ, గోపు రాజారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సర్వులూ.. సంతోషంగుండాలె..
* సీతారామచంద్ర ఆలయంలో సీఎల్పీ నేత జానారెడ్డి ప్రత్యేక పూజలు
మిర్యాలగూడ, జూన్ 19: వేములపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ఆహ్వానం అందినప్పటికీ రాలేకపోవడంతో మంగళవారం వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతి ఒక్కరూ పాడి పంటలతో, అయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొని కేక్ కట్‌చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి స్కైలాబ్‌నాయక్, మాజీ జడ్పీటీసీ సభ్యుడు పందిరి శ్రీనివాస్, డీసీఏంఏస్ వైస్ చైర్మన్ చిరుమర్రి కృష్ణయ్య, ఆలయ కమిటి అధ్యక్షులు బండి యాదగిరిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మాలి కాంతారెడ్డి, నాయకులు దామిడి గోపాల్‌రెడ్డి, తోట సైదులు, పుట్టల శ్రీనివాస్, పుట్టల జానయ్య, కల్లు శ్రీను, పాల్వాయి రాబర్ట్, పుట్టల గురువయ్య, వినోద్, బుర్రి వెంకట్‌రెడ్డి, దైద ప్రసాద్, శ్రీశైలంలు పాల్గొన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే
పంటలకు మద్దతు ధర.. నిరుద్యోగ భృతి

సూర్యాపేటటౌన్, జూన్ 19: ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను పట్టణంలోని వాణిజ్య భవన్ చౌరస్తాలో మంగళవారం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకలకు మాజీ మంత్రి, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్‌రెడ్డిలు ముఖ్య అతిధులుగా హాజరై రాహుల్‌గాంధీ జన్మదినం సందర్భంగా భారీ కేక్‌ను కట్‌చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని మోదీలకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందన్నారు. దళితులకు మూడెకరాల భూమి, నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్ల్లు కేటాయించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతుల పంటలకు మద్దతు ధరను పెంచడంతో పాటు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. అనంతరం స్నేహ నిలయంలో అనాథలకు పండ్లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో నల్లగొండ పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుమ్మరికుంట్లు వేణుగోపాల్, అసెంబ్లీ అధ్యక్షుడు బైరు శైలేందర్, కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు ఏడ్ల వీరమళ్లుయాదవ్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నెలుట్ల లింగస్వామి, నాయకులు బైరు వెంకన్న, షఫి ఉల్లా, వల్ధాస్ దేవేందర్, అంజద్‌అలీ, బాలుగౌడ్, పిల్లల రమేష్, మాధవరెడ్డి, లింగస్వామి, లింగయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కను పాపపై కాఠిన్యం!
*మూడోసారీ ఆడబిడ్డ పుట్టిందని వదిలించుకున్న తల్లిదండ్రులు
దేవరకొండ, జూన్ 19: మూడో సంతానంలో కూడా ఆడపిల్ల పుట్టడంతో శిశువును సాకడం భారంగా భావించిన తల్లిదండ్రులు ఆ శిశువును వేరే వారికి అప్పగించగా శిశువు కనిపించకుండా పోయిందని సీడీపీవో సక్కుబాయి పోలీస్‌లకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపిన పోలీస్‌లు శిశువు ఆచూకీని కనుగొని మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో సీడీపీవో సక్కుబాయికి అప్పగించారు. ఈ సంఘటనకు సంబంధించి సీఐఎంజీఎస్ రామకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దేవరకొండ మండలం ముదిగొండ గ్రామంపంచాయతీ పరిధిలోని కుంకుడుచెట్టుతండాకు చెందిన ఆంబోతు జ్యోతి, సీతారాం దంపతులకు మూడో కాన్పులో జన్మించిన ఆడశిశువుకు ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రిలో చూపించాలని గత నెల 8వ తేదీన దేవరకొండకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి శిశువు అదృశ్యమైంది. అయితే జ్యోతి దంపతులు దేవరకొండ పట్టణానికి చెందిన మంగళపల్లి నర్సింహ్మ హైద్రాబాద్‌లో నివసించే తన బంధువులైన మెట్టు లలిత, శ్రీనివాస్ దంపతులకు పిల్లలు లేకపోవడంతో శిశువును సాకుకుంటామంటే అప్పగించారు. శిశువును వేరే వారికి ఇచ్చేలా జ్యోతి, సీతారాం దంపతులను జ్యోతి తండ్రి నేనావత్ పాండు, పాండు బావమర్ధి ఆంగోతు మున్నిలు ప్రోత్సహించారు. 8 వ తేదీన జన్మించిన శిశువు కనిపించకుండా పోవడంతో తండాలో విచారణ జరిపిన సీడీపీవో సక్కుబాయి శిశువు తల్లిదండ్రులు జ్యోతి, సీతారాం దంపతులతో పాటు పాండు, మున్నీ లపై పోలీస్‌లకు ఫిర్యాదు చేసింది. సీడీపీవో ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపి హైద్రాబాద్‌లో మెట్టు లలిత, శ్రీనివాస్ దంపతుల వద్ద ఉన్న శిశువును స్వాధీనం చేసుకొని మంగళవారం శిశువు తల్లిదండ్రులకు సీడీపీవో సక్కుబాయి సమక్షంలో అప్పగించినట్లు సీఐ ఎంజీఎస్ రామకృష్ణ చెప్పారు. ఈ సంఘటనపై శిశువును వేరే వారికి అప్పగించిన, తీసుకున్న వారందరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ ఎంజీ ఎస్ రామకృష్ణ చెప్పారు.