నల్గొండ

రెడ్లరేపాకలో ప్రేమజంట ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వలిగొండ, జూన్ 21: యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలోని రెడ్లరేపాక గ్రామానికి చెందిన సిరికొండ వెంకటేశం, దంతూరి సిరి అనే ప్రేమికులు వేరువేరు ప్రాంతాల్లో బుధవారం ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్లితే రెడ్లరేపాక గ్రామానికి చెందిన గుర్రం స్వాతిరెడ్డి, కడారి వెంకట్ అనే ప్రేమికుల వివాహం వారం క్రితం హైదరాబాద్‌లో జరిగింది. వివాహం అనంతరం స్వాతిరెడ్డి, కడారి వెంకట్‌లు పరారీలో ఉన్నారు. ఇలా ఉండగా వారిద్దరి కులాంతర వివాహానికి రెడ్లరేపాక గ్రామానికే మరో ప్రేమ జంట వెంకటేశం, సిరి కారణమని స్వాతిరెడ్డి తండ్రి పాపిరెడ్డి వారిని చంపుతానని బెదిరించినట్లు తెలిసింది. దీనితో భయాందోళనకు గురైన హైద్రాబాద్‌లో ఉంటున్న వెంకటేశం, గుంటూరు జిల్లాలోని రేపల్లేలో బ్యూటిషన్ కోర్సు చేసేందుకు వెళ్లిన సిరి బుధవారం ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కాగా, గురువారం నాడు వెంకటేశం, సిరి మృతదేహాలతో వారి బంధువులు, గ్రామస్థులు తమ పిల్లల మృతికి పాపిరెడ్డియే కారణమని రెడ్లరేపాకలోని అతని ఇంటి ముందు రాత్రి వరకు ధర్నాకు దిగారు. చనిపోయిన ప్రేమికుల ఇద్దరిది ఒకే గ్రామం కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయ. మరోవైపు మృతుల కుటుంబ సభ్యులు పాపిరెడ్టి ధర్నాకు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ ఘటనపై స్థానిక ఎస్‌ఐ ఇద్రీస్ అలీ సంఘటన స్థలంలో భారీ పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు.