నల్గొండ

జయశంకర్ సార్ బాటలో.. తెలంగాణ అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూన్ 21: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితకాలం పరితపించిన ప్రొఫెసర్ జయశంకర్ బాటలో సీఎం కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు. గురువారం జయశంకర్ ఏడవ వర్ధంతిని నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల వ్యాప్తంగా టిఆర్‌ఎస్ శ్రేణులు, తెలంగాణ ఉద్యమకారులు, ప్రజా సంఘాలు ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో జయశంకర్ విగ్రహానికి మంత్రి జగదీష్‌రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగదీష్‌రెడ్డి మాట్లాడుతు తెలంగాణ ఉద్యమ సిద్ధాంతాకర్తగా జయశంకర్ సార్ అందించిన స్ఫూర్తితో సీఎం కెసిఆర్ తెలంగాణ సాధన ఉద్యమాన్ని సాగించి రాష్ట్రాన్ని సాధించారన్నారు. జయశంకర్ కలలు, ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ ప్రజల సమగ్రాభివృద్ధి ధ్యేయంగా కెసిఆర్ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. తెలంగాణలోని అన్ని వర్గాలు, ప్రాంతాలు అభివృద్ధికి తెలంగాణ పునర్ నిర్మాణానికి కెసిఆర్ సాగిస్తున్న కృషిని, సంక్షేమ, అభివృద్ధి రంగంలో నాలుగేళ్ల తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిపిన వైనాన్ని జయశంకర్ సార్ చూసి ఉంటే ఎంతో సంతోషించేవారన్నారు. సీఎం కెసిఆర్ అమలు చేస్తున్న ప్రతి పథకం జయశంకర్ సార్ ఆలోఛనలేనన్నారు.