నల్గొండ
ప్రారంభమైన ఎల్లమ్మతల్లి ఉత్సవాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 22 June 2018
కనగల్, జూన్ 21: మండలంలో రేణుకా ఎల్లమ్మతల్లి బ్రహ్మోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం మంగళవాయిద్యాలతో సుప్రభాత సేవ అనంతరం లలిత సహస్రనామార్చన, ఆలయ ప్రదక్షిణలు, పుణ్యాహవచనం, పంచగవ్యం, అఖండ దీపారాధన, సాయంత్రం మంత్ర వచనాలు, రాత్రి ఎదుర్కోళ్ల మహోత్సవం నిర్వహించారు. కాగా శుక్రవారం ఎల్లమ్మ, జమదగ్ని కల్యాణ మహోత్సవం జరుగుతుందని, ఈ కల్యాణంలో మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, అధికారులు పాల్గొంటారని ఆలయ అర్చకులు తెలిపారు. ఈకార్యక్రమంలో ఆలయ ఈవో మనోహర్‌రెడ్డి, మాజీ ఆలయ చైర్మన్ మేక ఉమారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.