నల్గొండ

ఎన్నికలకు భయపడే కోర్టుకెళ్లిన కాంగ్రెస్ నాయకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట రూరల్, జూలై 12: పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు టీఆర్‌ఎస్‌దేనని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ధీమా వ్యక్తం చేశారు. బీసీలకు పెద్దపీట వేస్తూ సముచిత న్యాయం అందిచేది టీఆర్‌ఎస్ ప్రభుత్వ మేనన్నారు. గురువారం మండలంలోని ధర్మారెడ్డి గూడెంలో రూ.1.08 కోట్లలతో ధర్మారెడ్డి గూడెం నుండి కొలనుపాక వరకు బీటీ రోడ్డుకు ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునితారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా సమావేశంలో ఎంపీ బూర మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుంటుందన్నారు. ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌తో బీసీల సీట్ల కోసం కోర్టుకు వెళ్లారని విమర్శించారు. సుప్రీం కోర్టుకు వెళ్లైనా సరే బీసీలకు 34 శాతం రిజర్వేషన్ తీసుకొచ్చేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజా క్షేత్రంలో ఓటమి తప్పదన్న భయంతో ఆ పార్టీ నాయకులు ఎన్నికలను, ప్రాజెక్టులను అడ్డుకుంటుందని దుయ్యబట్టారు. ధర్మారెడ్డిగూడెం ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని 50 ఏళ్లుగా కొలనుపాక నుండి ధర్మారెడ్డి గూడెం వరకు బీటీ రోడ్డుకై ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గడ్డమీది స్వప్న, జడ్పీటీసీ కర్రె కమలమ్మ, సర్పంచ్ స్వర్గం పరమేశ్వరి, ఎంపీటీసీ సభ్యులు నెమిలె అరుణ, టీఆర్‌ఎస్ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరె యాదగిరి, మండలపార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, యువజన విభాగం నాయకులు గడ్డమీది రవీందర్‌గౌడ్, మిట్ల వెంకటయ్య, చిత్తర్ల బాలయ్య, బడిగె కిష్టయ్య, బోనగిరి పరమేష్, పాండవుల భాస్కర్ పాల్గొన్నారు.

పత్తి రైతులకు దూరంగా ఫసల్ బీమా
- నేటితో ముగియనున్న గడువు
నల్లగొండ, జూలై 12: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పంటల బీమా పథకం ‘్ఫసల్ బీమా యోజన’లో చేరేందుకు పత్తి, అయిల్ ఫాం రైతులకు నేటితో గడువు ముగిసిపోనుంది. బ్యాంకర్లు పంట రుణాల పంపిణీ, రీషెడ్యూల్ పది శాతం కూడా పూర్తి చేయకపోవడంతో పెద్ద ఎత్తున రైతులు ఫసల్ బీమాకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద జూలై 15 నాటికి పత్తికి ఎకరాకు 1750 ప్రీమియం చెల్లిస్తే 35 వేల రూపాయల బీమా పొందే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా పత్తి సాగు చేసే రైతులకు ఈ బీమా పథకం ప్రయోజనకరంగా ఉంది. నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలు, ధరణి వెబ్‌సైట్ సాంకేతిక సమస్యల నేపథ్యంలో బ్యాంకర్లు పంట రుణాల మంజూరుకు జాప్యం చేస్తుండటంతో రైతులు బీమా పొందలేకపోతున్నారు. సాధారణంగా పంటల బీమా పథకాల ప్రీమియంలను బ్యాంకర్లు రుణాల మంజూరు సందర్భంగా చెల్లించుకొని మిగతా సొమ్ము రైతులకు అందజేస్తారు. ఉమ్మడి జిల్లాలో రుణమాఫీ పొందిన లబ్ధిదారుల సంఖ్య మేరకు 4 లక్షల 95 వేల మంది రైతులున్నారు. వీరిలో అధిక శాతం మంది పత్తి పంటల సాగు చేస్తున్నారు. వరుసగా శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో ఫసల్ బీమా యోజనలో చేరేందుకు గడువు నేటితో ముగిసిపోనుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేటికి 5 వేల మంది రైతులు కూడా ఫసల్ బీమాలో చేరకపోవడం గమనార్హం. అలాగే వరి పంటకు ఫసల్ బీమాకు 680 ప్రీమియం చెల్లిస్తే 35 వేలు బీమా సహాయం అందనుండగా ప్రీమియం చివరి తేది ఆగస్టు 31గా నిర్ణయించారు. కందికి 280 ప్రీమియం చెల్లిస్తే 14 వేల బీమా సహాయం, పెసరుకు 300 ప్రీమియానికి 15 వేల బీమా సదుపాయం అందనుండగా ప్రీమియం చెల్లింపు చివరి తేది జూలై 31గా నిర్ణయించారు.వాతావరణ ఆధారిత పంటల బీమా కింద మిరప పంటకు 2900 ప్రీమియం జూలై 31లోగా చెల్లిస్తే 58 వేల బీమా, బత్తాయికి ఆగస్టు 9లోగా 2250 ప్రీమియం చెల్లిస్తే 45 వేల బీమా సదుపాయం అందనుంది. ఉమ్మడి జిల్లాతో పాటు తెలంగాణలో పత్తి సాగు చేస్తున్న లక్షలాది మంది రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఫసల్ బీమా ప్రీమియం చెల్లింపు గడువును పొడిగించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

తహశీల్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
తిప్పర్తి, జూలై 12: తహశీల్దార్ కార్యాలయాన్ని గురువారం కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలోని భూప్రక్షాళనకు సంబంధించిన సమస్యలు, తదితర వివరాలను తహశీల్దార్ వెంకటేశ్వర్లు మూర్తిని అడిగి తెలుసుకున్నారు. మండలంలో భూప్రక్షాళన సవరణలు 60 శాతం పూర్తయ్యాయని, మిగిలిన కొన్ని గ్రామాల్లో సమస్య ఉండటంతో జాప్యం జరుగుతుందని కలెక్టర్‌కు వివరించగా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రెండో విడతలో పాస్‌పుస్తకాలను ఇక్కడే ముద్రించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట తహశీల్దార్, డీటీ కమలాద్రి, గిర్దావరు అర్జున్‌రావు ఉన్నారు.