నల్గొండ

హరితహరంలో అందరూ భాగస్వాములు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జూలై 12: పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమస్థాయిలో నిర్వహిస్తున్న నాల్గో విడత హరితహరం కార్యక్రమంలో సమాజంలోని అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రం శివారులోని సువెన్ లైఫ్ సైన్స్ పరిశ్రమలో పరిశ్రమల శాఖ జీఎం ఆధ్వర్యంలో గురువారం ఐదువేల మొక్కలను నాటారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ త్వరలో ప్రారంభంకానున్న హరితహరం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టి విరివిగా మొక్కలు నాటాలన్నారు. జిల్లాలో అడవుల శాతం తక్కువగా ఉన్నందున పరిశ్రమల యజమానులు స్వచ్ఛందంగా హరితహారంలో పాల్గొని మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలన్నారు. హరితహరం కార్యక్రమంలో జిల్లాలో నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు పరిశ్రమల శాఖ ప్రధాన భూమిక పోషించాలన్నారు. మొక్కలతోనే మానవళి మనుగడ సాధ్యమన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అడవులను పరిరక్షించాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో విస్తృతంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించే విధంగా తగిన ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. జిల్లాలో హరితహరం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జీఎం బాబురావు, సూర్యాపేట ఎంపీపీ వట్టె జానయ్యయాదవ్, ఎంపీడీవో టి.నాగిరెడ్డి, దాసాయిగూడెం సర్పంచ్ బాలిని పద్మ, సువెన్ పరిశ్రమ యూనిట్ హెడ్ వీఎస్‌ఎన్.మూర్తి, వైస్ ప్రెసిడెంట్ కేవి. శేషగిరిరావు, పీజె.రాయుడు, కృష్ణరావు, వీరయ్య, మేనేజర్ బూర రాములు తదితరులు పాల్గొన్నారు.

లక్ష్మినారసింహునికి నిత్య పూజలు
యాదగిరిగుట్ట, జూలై 12: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహస్వామి వారి ఆలయంలో గురువారం ఆరాధనలు, అర్చనలు, అష్టోత్తరాలు, కల్యాణం, హవనము, మొదలగు కార్యక్రమాలు జరిగాయి. ఉదయమే స్వామి, అమ్మవార్లను సుప్రభాతంతో మేల్కొలిపి హారతి నివేదన చేశారు. స్వామి, అమ్మవార్లను ఉత్సవమూర్తులకు పంచామృతంతో అభిషేకం జరిపారు. అత్యంత సుందరంగా అలంకరించి తులసీపత్రాలతో కొలిచారు. కవచమూర్తులను స్వర్ణపుష్పాలతో ఆరాధించారు. ఆలయంలోని మహా మండపంలో విశ్వక్‌సేన ఆరాధన, పుణ్యాహవచనము, హవనము అర్చకుల, వేదపండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య కొనసాగింది. అనంతరం స్వామి, అమ్మవార్లను అలంకరించిన గజవాహనంపై అధిష్టింపజేసి సేవ ఉత్సవాన్ని నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల నిత్యకల్యాణ మహోత్సవాన్ని అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం జరిపారు. బాలాలయంలో ఉదయం నుండి సాయంత్రం వరకు కొనసాగిన అష్టోత్తరం, సహస్రనామార్చనల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం ఆలయంలో స్వామి, అమ్మవార్ల వెండి జోడి సేవ ఉత్సవాన్ని జరిపారు.