నల్గొండ

పానగల్ జంక్షన్‌లో ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, జూలై 16: నల్లగొండ పట్టణ శివారులోని నార్కట్‌పల్లి-అద్దంకి బైపాస్ పానగల్ ఇందిరాగాంధీ జంక్షన్ వద్ద వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నందునా ఇక్కడ ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అధికారులను ఆదేశించారు. సోమవారం డీటీవో చంద్రశేఖర్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్ దేవ్‌సింగ్, డీఎస్పీ సుధాకర్‌లతో కలిసి ఆయన పానగల్ జంక్షన్‌ను పరిశీలించారు. ప్రమాదాలు జరుగుతున్న తీరుపై వివరాలు తెలుసుకుని ప్రమాదాల నివారణ చర్యలకు అవసరమైన అన్ని జాగ్రత్తలు రెండు రోజుల్లో చేపట్టాలన్నారు. రహదారిపై బార్ కోడింగ్, రేడియం బుల్లెట్‌లు, నైట్ లైటింగ్, ప్రమాద సూఛికల బోర్డులు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ నియంత్రణ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. జాతీయ రహదారులపై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ బ్రేకర్లు పెట్టాలని ఆదేశించారు. ఇందిరాగాంధీ విగ్రహం వద్ద లైటింగ్ ఏర్పాటు చేసి ప్రమాద హెచ్చరికలను పక్కాగా కనిపించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐలు ప్రసాద్, భాషా, అయోధ్య, ఎస్‌ఐ మధు తదితరులు ఉన్నారు.

నలుగురు బాల కార్మికులకు విముక్తి
కొండమల్లేపల్లి, జూలై 16: ఆపరేషన్ ముష్కాన్ లో భాగంగా సోమవారం నేరెడుగొమ్ము ఎస్‌ఐ బాలస్వామి ఆధ్వర్యంలో కొండమల్లేపల్లి మండల కేంద్రం లోని పలు దుకాణాలపై దాడులు నిర్వహించి నలుగురు బాలకార్మికులకు విముక్తి కల్పించారు. ఈ దాడులకు సంబంధించి ఆపరేషన్ ముస్కాన్ దేవరకొండ ఇన్‌చార్జ్, నేరెడుగొమ్ము ఎస్‌ఐ బాలస్వామి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బాలకార్మికులను గుర్తించే కార్యక్రమంలో భాగంగా సోమవారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలో వివిధ దుకాణాలపై దాడులు నిర్వహించగా సాయి బైక్‌పాయింట్, శివ బైక్‌పాయింట్‌లలో పని చేస్తున్న నలుగురు బాలకార్మికులను గుర్తించినట్లు చెప్పారు. వీరికి రోజుకు రూ.100 కూలీ చెల్లిస్తూ పని చేయించుకుంటున్నారని తెలిపారు. నూతనగంటి సాయికుమార్, చిత్రం పవన్, ఏరెడ్ల రవీందర్‌రెడ్డి, మార్గం ఆంజనేయులులకు విముక్తి కల్పించినట్లు ఆయన చెప్పారు. చిన్నారులను పనిలో పెట్టుకున్న సాయి బైక్‌పాయింట్ యజమాని సంకోజు సురేశ్, శివ బైక్‌పాయింట్ యజమాని ఘణపురం రాంబాబులపై కేసు నమోదు చేశామన్నారు. దాడుల్లో కొండమల్లేపల్లి వీఆర్వో మండలి వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్ళు నగేశ్, ఉపేందర్, రాములు, రేవతి, చైల్డ్ లైన్ సభ్యురాలు చిట్టి పాల్గొన్నారు.