నల్గొండ

డిసెంబర్‌లో డిండి ఎత్తిపోతల నీళ్లు పారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 16: కరవు, ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లా వాసులకు సాగు, తాగునీరందించే డిండి ఎత్తిపోతల పథకం రిజర్వాయర్ల పనులను డిసెంబర్ కల్లా పూర్తి చేసి చెరువులకు నీరందించాలని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి టీ.హరీష్‌రావు ఇరిగేషన్ అధికారులు, ప్రాజెక్టు ఇంజనీర్లకు నిర్ధేశించారు. సోమవారం జలసౌథలో డిండి ఎత్తిపోతల రిజర్వాయర్లు, కాల్వల పనుల పురోగతిని ఆయన ఆయన ప్యాకేజీల వారిగా సమీక్షించారు. డిండికి ప్రత్యేకంగా చీఫ్ ఇంజనీర్‌ను నియమించడాన్ని పరిశీలించాలని, రిజర్వాయర్ల నిర్మాణా పనుల్లో నాణ్యతలో రాజీ పడవద్దని ఈఎన్‌సీలు మురళీధర్, నాగేందర్‌రావు, చీఫ్ ఇంజనీర్ సునీల్, ఓఎస్‌డి శ్రీ్ధర్ దేశ్‌పాండేలను ఆదేశించారు. డిండి ఎత్తిపోత పథకంలోని సింగరాజుపల్లి, గొట్టిముక్కల రిజర్వాయర్లను ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలని ఆదేశించారు. పనులకు అడ్డంకింగా ఉన్న విద్యుత్ టవర్ల తరలింపునకు విద్యుత్‌శాఖతో చర్చించి సత్వరమే చేపట్టాలన్నారు. ప్యాకేజీ-1లో ప్రధాన కాలువలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మూడు కిలోమీటర్లకు మిగిలిన రెండు కిలోమీటర్ల పనులను వెంటనే చేపట్టాలని, నాగర్‌కర్నూల్ పరిధిలోని 22 కిలోమీటర్ల భూసేకరణ పూర్తి చేసి పనులు వేగవంతం చేయాలన్నారు. నల్లగొండ జిల్లా పరిధిలోని సింగరాజుపల్లి రిజర్వాయర్ పనులు 75శాతం, గొట్టిముక్కల రిజర్వాయర్ పనులు 70శాతం ర్తయినందునా మిగతా పనులు వేగంగా పూర్తి చేసి చెరువులు నింపేందుకు డిస్ట్రిబ్యూటరీ నెట్ వర్క్ పనులు పూర్తి చేసి గొలుసుకట్టు చెరువులు నింపడం ద్వారా 13వేల ఎకరాలకు సాగునీరందించాలన్నారు. వాటి పరిధిలో నిర్వాసితులకు అందించాల్సిన రూ.32కోట్లు వెంటనే విడుదల చేస్తామని పనులను అక్టోబర్‌లోగా పూర్తి చేయాలన్నారు. అలాగే సింగరాజుపల్లి, గొట్టిముక్కల రిజర్వాయర్ పనులకు 10కోట్ల చొప్పున విడుదలకు, కిష్టరాంపల్లి రిజర్వాయర్ పనులకు 10కోట్లు విడుదలకు మంత్రి ఆమోదం తెలిపారు. ఈ ప్యాకేజీ-4లో 15కిలోమీటర్ల ప్రధాన కాలువ పనుల్లో ఐదు కిలోమీటర్లు పూర్తి చేసినట్లుగా అధికారులు తెలిపారు. ప్యాకేజీ-5లో పనులు వేగం పెంచాలన్నారు. ప్యాకేజీ-6లో శివన్నగూడెం రిజర్వాయర్ పనులు వేగవంతానికి అన్ని చర్యలుచేపట్టాలని, నర్సిరెడ్డిగూడెం నిర్వాసితులకు పరిహార ప్యాకేజీలు అందించాలన్నారు. ప్యాకేజీ-2లో పనుల్లో ఎర్రవెల్లి గోకారం రిజర్వాయర్, ప్రధాన కాలువ 12కిలోమీటర్ల పనుల పూర్తికి 20కోట్లు విడుదల చేశామన్నారు. ప్యాకేజీ-3లో 10కిలోమీటర్ల కాలువకు 6కిలోమీటర్లు పూర్తయినట్లుగా ఇంజనీర్లు వివరించారు. డిండి ప్రాజెక్టు పరిధిలో అటవీ శాఖ భూముల సేకరణపై సలహాదారు సుధాకర్‌తో, కలెక్టర్లతో చర్చించి భూసేకరణ వేగవంతం చేయాలని మంత్రి హరీష్‌రావు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.