నల్గొండ

దేవుడా..! పిల్లల చదువెట్లా సాగేది..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుంగతుర్తి, జూలై 16: ఉపాధ్యాయుల బదిలీల వ్యవహరాలు ఆ పాఠశాలల విద్యార్థు లకు ఆశనిపాతంగా మారాయి. బదిలీపై వెళ్లిన వారు వెళ్లగా వచ్చే వారంతా ముఖం చాటేయడంతో ఆ పాఠశాలల్లో కనీసం ఒక్కరంటే.. ఒక్కరు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడు లేక వెలవెలబోతున్నాయి. దీంతో తమ పిల్లల భవిష్యత్‌పై ఆశలు పెంచుకున్న తల్లిదండ్రులు నేటి పరిస్థితులను చూసి లబోదిబోమంటున్నారు. మా పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించండి సారూ.. అంటూ వారంతా గొంతెత్తి ఉన్నతాధికారులకు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఉమ్మడి తుంగతుర్తి మండలంలోని పలు గ్రామాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల నెలకొన్న విచిత్ర పరిస్థితి ఇది. వివరాలలోకి వెళ్తే.. తూర్పుగూడెం గ్రామ పాఠశాలలో 57మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో పనిచేస్తున్న నలుగురు ఉపాధ్యాయులు ఇటీవలే బదిలీ కాగా కొత్తవారు రావడానికి ముఖం చాటేశారు. దీంతో పాఠశాలలో ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేడు. దీంతో విద్యార్థులంతా ఆరుబయటే ఒకే చోట కూర్చొంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అలాగే గుమ్మడవెల్లి జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో మొత్తంగా 30మంది విద్యార్థులు ఉన్నారు. గత ఏడాది ముగ్గురు ఉపాధ్యాయులు ఉండగా వారంతా బదిలీపై వెళ్లగా ఒక్కరు కూడా రాలేదు. దీంతో పాఠశాలకు పిల్లలు రావడమే మానేశారు. అలాగే గొట్టిపర్తి గ్రామ సక్సెస్ పాఠశాలలో దాదాపు రెండు వందల మంది విద్యార్థులు ఉండగా బదిలీల అనతంరం ఒక్కరు మాత్రమే మిగిలారు. రావులపల్లి, బండరామారం గ్రామ పాఠశాలలో కూడా ఇదే పరిస్థితి. ముఖ్యంగా ఉమ్మడి మండలంలో మొత్తంగా 14 జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలు ఉండగా కేవలం రెండు పాఠశాలలకు మాత్రమే ప్రధానోపాధ్యాయులు ఉన్నారు. అంతేగాకుండా 45 మంది ఉపాధ్యాయులు బదిలీ కాగా కేవలం 26 మంది మాత్రమే తిరిగి వచ్చారు. ముఖ్యంగా పాఠశాలలు తెరిచి దాదాపు 50రోజులు కావొస్తున్నా కొన్ని పాఠశాలల్లో ఇంకా పాఠాలే మొదలుకాకపోవడం విశేషం. దీనికి తోడు ఉన్న ఉపాధ్యాయులు కూడా బదిలీపై వెళ్లడంతో విద్యావ్యవస్థ ఏవిధంగా కొనసాగుతుందని ఆయాప్రాంతాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే ఆ పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించి విద్యా బోధన జరిగేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

పంచనారసింహునికి నిత్య పూజలు, కల్యాణం
యాదగిరిగుట్ట, జూలై 16: పంచనారసింహ క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహ స్వామివారి ఆలయంలో సోమవారం ఒకవైపు వైష్ణవ ఆరాధనలు, మరోవైపు శివ నామార్చనలు కొనసాగాయి. ప్రముఖ వైష్ణవక్షేత్రమే అయినా స్వామివారి సన్నిధిలో పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామివారు భక్తుల నిత్యపూజలందుకుంటున్నారు. కొండపై హరిహరులను ఆరాధిస్తూ పూజారులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీస్వామి వారి ఆలయంలో సోమవారం నిత్యారాధనలు, అర్జిత సేవలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. వేకువజామున సుప్రభాతంతో స్వామి, అమ్మవార్లను మేల్కొలిపి మంగళహారతి నివేదించారు. బిందెతీర్థంతో స్వామివారికి బాలభోగం కార్యక్రమాలతో నిత్య కైంకర్యాలు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రతిష్టామూర్తులను పూజించిన పూజారులు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పంచామృతంతో అభిషేకించి తులసీపత్రాలతో అర్చించారు. వివిధ సుగంధ పరిమళాల పూలమాలలతో పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అత్యంత సుందరంగా దేదీప్యమానంగా అలంకరించారు. ఉత్సవమూర్తులను స్వర్ణపుష్పాలతో ఆరాధించి కొలిచారు. ఆలయ మహా మండపంలో అర్చకులు, వేద పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వామి, అమ్మవార్ల నిత్య కల్యాణాన్ని పంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం వైభవంగా జరిపారు. స్వామి, అమ్మవార్లను అత్యంత సుందరంగా అలంకరించిన గజవాహనంపై అధిష్టింపజేసి సేవ ఉత్సవాన్ని నిర్వహించారు. బాలాలయంలో ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్వహించిన అష్టోత్తరం, సహస్రనామార్చనల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం స్వామి, అమ్మవార్ల వెండి జోడి సేవ నిర్వహించారు.
- యాదాద్రీశుని ఆదాయం 6 లక్షలు
యాదగిరి శ్రీలక్ష్మినరసింహ స్వామి రోజువారీ ఆదాయం 6లక్షల 40 వేల 566 రూపాయలు కాగా, ఇందులో ప్రధాన బుకింగ్ ద్వారా 15వేల 126, అతీశీఘ్ర దర్శనం ద్వారా 7వేల 800, వీఐపీ దర్శనం ద్వారా ఒక లక్షా 48వేల 200, వ్రతాల ద్వారా 18 వేలు, కల్యాణకట్ట 18 వేలు, విచారణశాఖ ద్వారా 24వేల 600, ప్రసాద విక్రయం ద్వారా 2లక్షల 53వేల 570, టోల్‌గేటు ద్వారా ఒక వెయ్యి 460, శాశ్వత పూజల ద్వారా 31 వెయ్యి 812, అన్నప్రసాదాల ద్వారా 15 వేల 900, వాహన పూజల ద్వారా 14వేల 500 రూపాయల ఆదాయం లభించినట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి గీత తెలిపారు.
- ముక్కంటికి ‘రుద్రాభిషేకం’
యాదగిరిగట్ట శ్రీలక్ష్మినరసింహ స్వామివారి కొండపై వేంచేసి ఉన్న శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి వారి ఉప శివాలయంలో సోమవారం ఉదయం రామలింగేశ్వరుని ఆరాధిస్తూ అర్చకులు మహన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. స్వామివారిని వివిధ రకాల పూలతో అలంకరించి వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య కొనసాగిన రుద్రాభిషేకంలో భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ముక్కంటిని కొలుస్తూ బిల్వ పత్రాలతో అర్చన చేశారు. అనంతరం శివ, పార్వతుల కల్యా ణం, సేవ ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మహాశివునికి జరిగిన అష్టోత్తరం, సహస్రనామార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.