నల్గొండ

బడ్జెట్‌లో ఆర్టీసీకి వెయ్యి కోట్లు కేటాయించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, జూలై 17: ప్రజా రవాణా ఆర్టీసికి ప్ర భుత్వం వెయ్యి కోట్లు కేటాయించాలని, డీజిల్‌పై పెరిగిన భా రాన్ని ప్రభుత్వమే భరించాలని ఆర్టీసి ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు ఎస్.బాబు, కార్యదర్శి రాజిరెడ్డి, ఏఐటీయూసి జిల్లా కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డిలు డిమాండ్ చేశారు. మంగళవా రం తెలంగాణ మజ్దూర్ యూనియన్ నుండి వెంకటయ్య ఆధ్వర్యంలో 150 మంది కార్మికులు ఈయూలో చేరిన సందర్భంగా టౌన్‌హాలులో నిర్వహించిన చేరికల కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో వైఫల్యం, పని ఒత్తిడి, కార్మిక సంక్షేమ పథకాల అమలులో వైఫల్యంతోనే కార్మికులు తమ సంఘంలో చేరారని, ప్రభుత్వం అద్దె బస్సులను రద్దు చేసి నూతన బస్సులను కొనుగోలు చేయాలని, కండక్టర్ల, డ్రైవర్ల రిక్రూట్‌మెంట్ జరపాలని, తదితర సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈకార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శులు కే.ఎస్.రెడ్డి, జెల్లా వెంకటేశ్వర్లు, మొహినొద్దిన్, కిషోర్, పాండురంగయ్య, ఎస్.రెడ్డి, గోపాల్‌రావు, వెంకటేశ్వర్లు, రేణుక, సైదులు, తదితరులు పాల్గొన్నారు.