నల్గొండ

క్షయవ్యాధి రహిత సమాజాన్ని నిర్మిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, జూలై 17: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేసి క్షయవ్యాధి రహిత సమాజాన్ని నిర్మిద్దామని భువనగిరి పార్లమెంటు సభ్యులు, క్షయనివారణ పార్లమెంటేరియన్ కమిటీ కన్వినర్ బూర నర్సయ్యగౌడ్ పిలుపునిచ్చారు. జాతీయ క్షయ నివారణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం భువనగిరి డాల్ఫీన్ కాన్ఫరెన్స్ హాల్‌లో అధికారులకు, ప్రజాప్రతినిధులకు క్షయ నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌తో పాటు అతిధులుగా ఎమ్మెల్సీ ఎలిమినేటి క్రిష్ణారెడ్డి, కలెక్టర్ అనితారామచంద్రన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతు క్షయవ్యాధి నివారణకు ఖచ్చితమైన వైద్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం క్షయవ్యాధి సోకిన వారికి వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తుందన్నారు. పౌష్టికాహారంతో పాటు క్రమం తప్పకుండ మందులు సేవించినట్లయితే క్షయవ్యాధి నయమవుతుందని తెలిపారు. క్షయవ్యాధి సోకిన రోగులు పౌష్టికాహారం తీసుకునేందుకు ప్రభుత్వం ప్రతి నెల 500 రూపాయలు వారి ఖాతాలలో జమా చేస్తుందన్నారు. రోగులకు వైద్య సేవలందించేందుకు ప్రత్యేకంగా మొబైల్ వ్యాన్‌ను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. వ్యాధి నివారణకై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ సూచించారు. క్షయవ్యాధితో ప్రతి సంవత్సరం పదివేల మంది మరణిస్తున్నారని, వ్యాధిని నివారించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యాచరణ చేపట్టిందన్నారు. జిల్లాలో క్షయవ్యాధి గ్రస్తులు 608మంది ఉన్నట్లుగా వైద్య ఆరోగ్య శాఖ నిర్ధారించిందని తెలిపారు.క్షయవ్యాధి నివారణకు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను రోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్షయవ్యాధి నిర్ణారణ అయిన వెంటనే సరైన చికిత్స అందజేయడంతో పాటు పూర్తిగా నయమయ్యే వరకు మందులు వాడాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు క్షయవ్యాధి నివారణ పట్ల ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్, టీబీ పార్లమెంటేరియన్ న్యూఢీల్లీ నుండి వచ్చిన డాక్టర్ మదన్‌మోహన్‌శర్మ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సాంబశివరావు, జిల్లా టీబీ వ్యాధినివారణ అధికారి రాజేషం, వివిధ మండలాల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా
ఆగస్టు 9న జైల్‌భరో
*సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి
నల్లగొండ రూరల్, జూలై 17: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా కార్మిక, వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 9న నిర్వహించే ‘జైల్ భరో’ను జయప్రదం చేయాలని సీ ఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక దొడ్డి కొమురయ్య భవన్‌లో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపి ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాస్తూ కార్పోరేట్ శక్తులను పెంచిపోషిస్తుందన్నారు. ప్రభుత్వంపై ప్రజలు పోరాటాలకు సిద్దం కావాలన్నారు. ఈనెల 25న రాష్ట్ర సదస్సు నిర్వహించి ఆగస్టు 9న జైల్ భరో, సెప్టెంబర్ 5న ఛలో ఢిల్లీ కార్యక్రమం ఉంటుందన్నారు. సాక్షర భారత్, మెప్మా, గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెకు సీ ఐటీయూ మద్దతిచ్చిందని, వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈసమావేశంలో సీ ఐటీయూ జిల్లా అధ్యక్షుడు చిన్నపాక లక్ష్మినారాయణ, అవుత సైదయ్య, నారబోయిన శ్రీనివాస్, దండెంపల్లి సత్తయ్య, మహ్మద్ బిన్ సయ్యద్, లకపక రాజు, మల్లు గౌతమ్‌రెడ్డి, వంటిపాక వెంకటేశ్వ ర్లు, చింతపల్లి బయ్యన్న, అద్దంకి నర్సింహ, యాదయ్య పాల్గొన్నారు.