నల్గొండ

పోచంపల్లి ఇక్కత్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూదాన్‌పోచంపల్లి, జూలై 17: పోచంపల్లి ఇక్కత్ పూర్వవైభవం కోసం అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు బృహత్తరమైన కార్యక్రమం రూపొందిస్తున్నట్లు ఖాదీ కమిషన్ సౌత్ జోనల్ చైర్మన్ జి. చంద్రవౌళి తెలిపారు. మంగళవారం మండలకేంద్రంలో సిల్క్ రీలింగ్ యూనిట్లను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నేత కార్మికులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వారికి ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుండి నూలును తీసుకురాకుండా స్థానికంగా ముడిసరుకులు సిల్క్ యూనిట్ల ద్వారా తయారు చేసుకోవడంలో శిక్షణలో నైపుణ్యం ఇస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి కార్యక్రమం కింద 68 కోట్ల రుణాలు, 25 కోట్ల వ్యక్తిగత రుణాలివ్వడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల చేతి, కులవృత్తుల అభివృద్ధి కోసం వారి జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు కృషి చేస్తామన్నారు. పోచంపల్లి ఇక్కత్‌కు విశేష ప్రాధాన్యత ఉందని, మరింత వైభవం పెంచేందుకు శాయశక్తుల కృషి చేస్తానన్నారు. 70 దేశాల్లో పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలను ప్రచారం చేస్తామని పేర్కొన్నారు. ఆయన వెంట ఆలిండియా హాండ్లూం బోర్డు డైరెక్టర్ కర్నాటి ధనుంజయ, ఖాదీ బోర్డు అసిస్టెంట్ డైరెక్టర్ సైదులు, బీజేపి నాయకులు యెన్నం శివకుమార్, గంజి బస్వలింగం, చిక్క కృష్ణ, కర్నాటి దశరథ, చిక్క జ్ఞానేశ్వర్, సుంకి దామోదర్, యెన్నం శ్రీనివాస్, గోశిక పాండు పాల్గొన్నారు.