నల్గొండ

సూర్యాపేటను సుందరంగా తీర్చిదిద్దుతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జూలై 17: గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అభివృద్దిలో వెనుకబాటుకు గురైన సూర్యాపేట పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ది పర్చి సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తానని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని పలువార్డుల్లో రూ.39.90లక్షల వ్యయంతో చేపట్టే సీసీరోడ్లు, మెటల్ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమైక్య పాలనలో ఏమాత్రం అభివృద్దికి నోచుకోక వెనుకబడిన పట్టణాన్ని అత్యధిక నిథులతో కనివిని ఎరుగని రితీలో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాకేంద్రంగా మారినందున అందుకు అనుగుణంగా పట్టణాన్ని అభివృద్ది చేయాలన్న సంకల్పంతో ప్రణాళికలు రూపొందించి ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఎక్కడైనా ఏటేటా అభివృద్ధి పెరుగుతుందని, అయితే రాష్ట్ర ఏర్పాటుకు ముందు అందుకు భిన్నంగా పట్టణాన్ని అభివృద్ధి చేయకపోగా సర్వనాశనం చేశారని గత పాలకులపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. విశాలంగా ఉన్న రోడ్లను ఇరుకు సందులుగా మార్చారని ఆరోపించారు. గత పాలకుల పాపాన్ని నేడు ప్రజలు అనుభవిస్తు ఇరుకు రోడ్లతో నిత్యం నరకయాతన పడుతున్నారన్నారు. గత పాలకుల 60ఏళ్ల నిర్లక్ష్యానికి గడిచిన నాలుగేళ్లలో ప్రక్షాళన చేస్తున్నామన్నారు. సూర్యాపేట ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు అతి త్వరలోనే అందరి సహకారంతో పట్టణంలో రోడ్ల విస్తరణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. రోడ్ల విస్తరణ జరిగి రెండు మినీట్యాంకు బాండ్‌ల నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు పూర్తయితే సూర్యాపేట రూపురేకలే మారిపోతాయన్నారు. పట్టణంలో అవసరమైన చోట అన్ని వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీలను నిర్మించి ప్రజలకు వౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు చేపడతామన్నారు. జిల్లాకేంద్ర అభివృద్దిపై తాను ప్రత్యేకశ్రద్ధ వహించి నిథులు మంజూరీ చేయిస్తున్నానని, గతంలో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా మున్సిపాలిటీకి రూ.70కోట్ల నిథులు మంజూరీ చేయించినట్లు తెలిపారు. పట్టణాభివృద్దికి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 3,31వవార్డులో రూ.16.90లక్షలతో నిర్మించే సీసీరోడ్డు, 20వవార్డులో రూ.11లక్షలతో మెటల్ రోడ్డు, 34వార్డులో రూ.12లక్షలతో మెటల్‌రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఆయా వార్డుల్లో స్ధానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక, జిల్లా గ్రంథాలయసంస్ధ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ చైర్మన్ వై. వెంకటేశ్వర్లు, వైస్ చైర్‌పర్సన్ నేరళ్ల లక్ష్మి, టీఆర్‌ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆకుల లవకుశ, కౌన్సిలర్లు వెలుగు సంతోషి, చలమళ్ల నర్సింహా, బీరవోలు శ్రీవిద్య, గోదల భారతమ్మ, బత్తుల ఝాన్సీ, నాయకులు తూడి నర్సింహారావు, మొరిశెట్టి శ్రీనివాస్, శేఖర్‌రెడ్డి, గండూరి ప్రకాశ్, గోదల రంగారెడ్డి, వెలుగు వెంకన్న, బత్తుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.