నల్గొండ

ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జూలై 20: పోలీస్ సిబ్బంది ఎల్లవేళల ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ప్రకాశ్‌జాదవ్ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారుల నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది, అధికారులు ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకుంటూ పారదర్శకంగా పనిచేయాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో నేరాల నివారణకు కృషిచేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను పరిశీలించి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై దృష్టిపెట్టాలని, కోర్టు విధులు నిర్వహించే వారికి సలహాలు ఇస్తూ కేసుల పెండింగ్ లేకుండా చూడాలన్నారు. ప్రతి జూలై నెలలో నిర్వహించే ముష్కాన్‌ను సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయంగా పనిచేస్తూ విజయవంతం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఇస్తున్న పీడీ ఎస్ బియ్యం, సబ్సీడీ గొర్రెల అక్రమ వ్యాపారం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో డీఎస్పీలు నాగేశ్వరరావు, సుదర్శన్‌రెడ్డి, సీ ఐలు శ్రీనయ్య, రవీందర్, శివశంకర్, రవి, నర్సింహరెడ్డి, శంకర్, ఎస్సైలు, డీసీ ఆర్‌బీ ఐటీ కోర్ సిబ్బంది, సీసీటీవీ కెమోరా వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.
నేడు రూ.50 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
- హాజరుకానున్న మంత్రి జగదీశ్‌రెడ్డి - ఎమ్మెల్యే రవీంద్రకుమార్
దేవరకొండ, జూలై 20: విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి శనివారం రోజు దేవరకొండ నియోజకవర్గంలోని పలు మండలాల్లో రూ.50 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారని ఎమ్మెల్యే ఆర్. రవీంద్రకుమార్ చెప్పారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి జగదీశ్‌రెడ్డి శనివారం ఉదయం 10 గంటలకు డిండి మండల కేంద్రానికి చేరుకొని డిండి ప్రాజెక్ట్ నీటిని విడుదల చేయడంతో పాటు పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం సింగరాజ్‌పల్లి గ్రామం వద్ద నిర్మిస్తున్న నక్కలగండి రిజర్వాయర్ పనులను పరిశీలిస్తారు. అనంతరం దేవరకొండ, కొండమల్లేపల్లి, చింతపల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని చెప్పారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు బాలనర్సింహ, ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, ముచ్చర్ల ఏడుకొండల్‌యాదవ్, టీవీఎన్ రెడ్డి, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.