నల్గొండ

కలెక్టరేట్ ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఆగస్టు 13: స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణను ఉపసంహరించుకోవాలని, తెలంగాణ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్ చేస్తు హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి తోపులాటలు, అరెస్టులతో సాగింది. బిజెపి, ఎబివిపి, విహెచ్‌పి, ఆర్‌ఎస్‌ఎస్, భజరంగ్‌దళ్, హిందూవాహిన తదితర సంస్థల నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా కలెక్టరేట్‌ను ముట్టడించి ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్లకు తరలించే ప్రయత్నంలో తోపులాట సాగింది. బిజెపి జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి సహా ఇతర నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నూకల నరసింహారెడ్డి మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలకు పరాకాష్టగా, మైనార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు నిదర్శనంగా పరిపూర్ణానంద బహిష్కరణ చర్య అంటు విమర్శించారు. తెలంగాణలో ప్రశాంతంగా నిరసన తెలిపై ప్రజాసంఘాలకు, పార్టీలను అణిచివేసే ధోరణిలోనే స్వామిజి బహిష్కరణకు కూడా కేసీఆర్ ప్రభుత్వం సిద్ధపడటం నియంతృత్వ విధానాలకు నిదర్శనమన్నారు. గోసంరక్షణ ఉద్యమకారులపై కూడా ప్రభుత్వం అణిచివేతకు పాల్పడుతు మైనార్టీ ఓట్ల కోసం ప్రాకులాడుతు లౌకిక విధానాలకు తిలోధకాలిస్తుందన్నారు. హిందూవులు ఇకనైనా మేల్కోని సంఘటితంగా తమ పట్ల సాగుతున్న అన్యాయాలను ప్రశ్నించాలన్నారు. ప్రభుత్వం వెంటనే పరిపూర్ణనందపై బహిష్కరణ ఎత్తివేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పొతేపాక సాంబయ్య, వివిధ సంఘాల నాయకులు కనె్నబోయిన వెంకట్, శివకుమార్, నర్సింహ్మ, వీరెల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.