నల్గొండ

రైతులకు టీఆర్‌ఎస్ పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కనగల్, ఆగస్టు 13: రైతాంగ అభివృద్ధికి సీఎం కేసీఆర్ సారధ్యంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో రైతుబీమా బాండ్లను పంపిణీ చేసి సభలో మాట్లాడారు. 1లక్ష 50వేల కోట్ల రూపాయలతో గోదావరి, కృష్ణ నీళ్లను తెలంగాణ బీళ్లకు మళ్లించేలా ప్రాజెక్టుల నిర్మాణం జరిపిస్తు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయిస్తున్నారన్నారు. 24గంటల వ్యవసాయ నిరంతర విద్యుత్, భూరికార్డుల ప్రక్షాళన, రైతుబంధు చెక్కులు, రైతుబీమా వంటి పథకాలను అమలుచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వమన్నారు. రైతురుణమాఫీ సైతం చేసి రైతుకు భరోసానిచ్చిందన్నారు. జిల్లాలోనే 3లక్షల 80వేల ఖాతాల ద్వారా 3లక్షల పాస్‌పుస్తకాలను పంపిణీ చేశామన్నారు. 30వేల ఖాతాల్లో తప్పులను సరిచేస్తున్నారన్నారు. జిల్లాలో మొదటి విడతగా 470కోట్లు రైతులకు రైతుబంధులో భాగంగా అందించారన్నారు. రాష్ట్రంలో 1200కోట్ల పెట్టుబడి రైతుబంధుతో రైతులకు అందించారన్నారు. జిల్లాలో 400కోట్ల చెక్కులు రైతులు డ్రా చేసుకున్నారన్నారు. రాష్ట్రంలో 42లక్షల మంది రైతులు 5,300కోట్లు డ్రా చేసుకున్నారన్నారు. రెండో విడతరైతుబంధు చెక్కులను నవంబర్‌లో జారీ చేస్తామన్నారు. రైతుబీమాను 636కోట్ల ప్రిమియంతో 25లక్షల మంది రైతులకు అందిస్తున్నారన్నారు. జిల్లాలో 4లక్షల టన్నుల ధాన్యాన్ని 604కోట్లు పెట్టి కొనుగోలు చేశారన్నారు. ఆగస్టు 15నుండి 3కోట్ల 56లక్షలమందికి కంటి వెలుగు వైద్య సేవలు మందులు, అద్దాలు అందిస్తారన్నారు. ఈనెల 18నుండి పాడి పశువుల పంపిణీ జిల్లాలో సాగుతుందన్నారు. తొలి విడతగా 14,600మందికి గేదెలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జెడిఏ శ్రీ్ధర్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ కరీంపాషా, ఎంపిపి కృష్ణయ్య, రైసస సభ్యులు మందడి చంద్రారెడ్డి, లక్ష్మయ్య, వెంకటేశం, ఏడి సుధ, ఏవో సంధ్యారాణి తదితరులు ఉన్నారు.