నల్గొండ

ప్రభుత్వాల హామీల అమలు కోసం సీపీఐ ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఆగస్టు 13: కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు సోమవా రం నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భు వనగిరి జిల్లాల కలెక్టరేట్‌లను ముట్టడించా రు. నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముట్టడిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లెపల్లి ఆదిరెడ్డిమాట్లాడుతు ప్రధాని నరేంద్ర మోదీ గత ఎన్నికల్లో నల్లధనం వెలికి తీసి ప్రతి వ్యక్తి ఖాతాలో లక్షన్నర వేస్తానని చెప్పి నోట్ల రద్ధుతో, జిఎస్‌టితో ప్రజల జీవనాన్ని దుర్భం చేశారన్నారు. మహిళలకు, చిన్నారులకు మోదీ పాలనలో రక్షణ లేకపోగా గోసంరక్షణ పేరుతో దాడులు చేస్తున్నారన్నారు. అణగారిన వర్గాలపై అరాచకాలు, నిరుద్యోగం పెరిగిపోతున్నాయన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో డబుల్ బెడ్‌రూమ్‌లు, కెజి టూ పిజి ఉచిత విద్య, దళితులకు మూడెకరాల భూమి వంటి హామీల అమలు జరుగలేదన్నారు. ఎస్‌ఎల్‌బిసి సొరంగం వంటి పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి నిధులివ్వకుండా కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టులకు వేలకోట్లు కేటాయిస్తున్నారన్నారు. లక్ష ఉద్యోగాలిస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. మహిళలకు మంత్రి వర్గంలో స్థానం లేదన్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికల హామీల అమలు వైఫల్యాలపై ప్రజలను చైతన్యపరిచేందుకు కలెక్టర్ల ముట్టడి చేపట్టామన్నారు. ఆ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ముట్టడి అనంతరం కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పల్లా నరసింహారెడ్డి, నాయకులు పల్లా దేవేంద్‌రెడ్డి, కె.కాంతయ్య, నెల్లికంటి సత్యం, ఎల్.శ్రవణ్, వెంకటేశ్వర్లు, వెంకటరమణ, వీరస్వామి, రామచంద్రం, లెనిన్, పద్మ తదితరులు పాల్గొన్నారు.