నల్గొండ

గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేటటౌన్, ఆగస్టు 13: గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండగ అని సూర్యాపేట శాసనసభ్యుడు, రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్దిశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం చివ్వెంల మండలపరిధిలోని లక్ష్మినాయక్‌తండాలోనిర్వహించిన తీజ్‌పండుగకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిదిరోజులుగా గోదుమ గింజలతో పెంచిన నారుకు ప్రతిరోజు నీరుపోసి ప్రత్యేక పూజలు చేసి గిరిజనులు భక్తిశ్రద్దలతో సాంప్రదాయ బద్దంగా పండుగను వేడుకగా జరుపుకుంటారన్నారు. ఈసందర్భంగా మంత్రి గిరిజనులకు తీజ్‌పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నృత్యాలతో కోలాహాలంగా తీజ్‌బుట్టలను నిమజ్జనం చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, టీఆర్‌ఎస్ మండలపార్టీ అధ్యక్షుడు కొణతం అప్పిరెడ్డి, మాజీ ఎంపీపీ రౌతు నర్సింహరావు, రైతుసమన్వయ సమితి మండల కన్వీనర్ భుక్యా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేటలో..
తీజ్ పండుగ వేడుకల్లో భాగంగా తొమ్మిదిరోజులు నిర్వహించే పూజా కార్యక్రమాల్లో ఎనిమిదరోజు స్థానిక విద్యానగర్‌లో ఢమోళి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి జిల్లా ఎస్పీ ప్రకాశ్‌జాదవ్ ముఖ్య అతిధిగా హజరై పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తీజ్‌పండుగ గిరిజనులకు ఎంతో ముఖ్యమైన పండుగని, గిరిజనులు ఈపండుగను భక్తిశ్రద్దలతో ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో ఏఐబీఎస్‌ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరిసింగ్‌నాయక్, నాయకులు భగవాన్‌సింగ్, పాండునాయక్, బాలాజీనాయక్, భాస్కర్‌నాయక్, మోతీలాల్‌నాయక్, పాశ్యనాయక్, లచ్చిరాంనాయక్, వెంకన్ననాయక్, అజయ్‌నాయక్, రత్తిబాయి, పద్మవెంకన్న, విజయ, సంధ్య, మంగమ్మ, సైదానాయక్, శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.