నల్గొండ

హెచ్‌ఐవి రహిత సమాజానికి కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, మే 15: హెచ్‌ఐవి రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. ఆదివారం నల్లగొండ యూత్ పాజిటివ్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర ఆసుపత్రి నుండి కొవ్వత్తుల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్‌ఐవి వ్యాది భారిన పడి చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. అంతేకాకుండా హెచ్‌ఐవి బాధితులు మానసిక దైర్యాన్ని కలిగి ఉండి ఆత్మ స్థైర్యంతో ఉండి డాక్టర్ల సలహా, సూచనల మేరకు సంబంధిత మందులను క్రమం తప్పకుండా వాడాలని సూచించారు. వారు, వారి పిల్లలు ఎన్నోరకాలుగా నిరాధారణకు గురవుతున్నారని, అందుకు జిల్లా పోలీస్ శాఖ వారికి అన్ని రకాల సహాయ సహకారాలకు అండగా ఉంటుందని, వారి పౌష్టిక ఆహారానికై వెంటనే స్పందించి తక్షణ సహాయంగా పదివేల ఆర్ధిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అమర్, యూత్ పాజిటివ్ సొసైటీ అధ్యక్షులు జి.కళ్యాణ్, జిల్లా ఎయిడ్స్ నియంత్రణాధికారి సుధాకర్, చంద్రవౌళి, రవీందర్‌రెడ్డి, ఎఆర్‌టి డాక్టర్ పవన్ కమార్, సామియల్ పాల్గొన్నారు.