నల్గొండ

జాతీయభావాన్ని పెంపొందించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, ఆగస్టు 14: దేశంలోని ప్రతి ఒక్కరు జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు బూర నర్సయ్యగౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో పంద్రాగస్టును పురస్కరించుకుని సిద్ధం చేసిన 2వేల ఫీట్ల జాతీయ పతాకాన్ని కళాశాల, పాఠశాలల విద్యార్థులు భువనగిరిలో ప్రదర్శించారు. ఎమ్మెల్సీ ఎలిమినేటి క్రిష్ణారెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్ జాతీయ జెండాను ఊపి పతాక ప్రదర్శనను ప్రారంభించారు. స్థానిక వైఎస్‌ఆర్ ఫంక్షన్ హాలు నుండి పట్టణ వీధుల గుండా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వరకు కొనసాగిన 2వేల ఫీట్ల జాతీయ పతాక ప్రదర్శన ఆకట్టుకుంది. జాతీయ పతాక ప్రదర్శనకు ముందుగా ఆర్యవైశ్యమహాసభ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్య అతిథులుగా ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ ఎలిమినేటి క్రిష్ణారెడ్డిలు మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగఫలమైన స్వాతంత్య్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమైక్యపాలనలో కోల్పోయిన అభివృద్ధిని రాష్ట్రం ఏర్పడ్డ అనంతరం సాధించుకున్నామన్నారు. కార్యక్రమంలో ఏసీపీ జితేందర్‌రెడ్డి, డీఈఓ రోహిణి, మున్సిపల్ యాక్టింగ్ చైర్‌పర్సన్ బర్రె మహాలక్ష్మి, ఆర్యవైశ్య మహాసభ సభ్యులు, నాయకులు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.