నల్గొండ

మార్పు కోసం బీజేపీ పల్లెబాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఆగస్టు 14: రానున్న 2019 ఎన్నికల్లో తెలంగాణలో అధికార సాధనే లక్ష్యంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగాలని పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యలయంలో నిర్వహించిన పార్టీ జిల్లా పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈనెల 17 నుండి 26 వరకు బీజేపీ పల్లెబాట నిర్వహిస్తుందన్నారు. ఇందులో భాగం గా బైకు ర్యాలీలు, యాత్రలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మాట తప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. మార్పు కోసం బీజేపీ పల్లెబాట నినాదంతో యాత్ర లు, ర్యాలీలు నిర్వహించాలన్నారు. మండలానికి 11 బైకులతో కనీసం 22 మంది సభ్యులు బృందంగా ఏర్పడి రోజుకు కనీసం నాలుగు గ్రామాలు పర్యటించి గ్రామంలోని ప్రధాన కూడళ్లు, దళితవాడల్లో ప్రచార సభలు నిర్వహించాలని సూచించారు. ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. అలాగే సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. అదేవిధంగా క్షేత్రస్థాయి పర్యటనల్లో చేసే బృందాలు స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయడం ద్వారా పార్టీకి ప్రజాదరణ సాధించేలా చూడాలన్నారు. కార్యక్రమంలో కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్, పల్లెబోయిన శ్యాంసుందర్, నూకల వెంకట్‌నారాయణరెడ్డి, బండారు ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతెపాక సాంబయ్య, మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌కే.బాబ, నాయకులు బైరగోని రాజయ్య, అనిత, అరుణ, లింగస్వామి, శ్రీనివాస్‌రెడ్డి, నాగిరెడ్డి, వెంకన్న, వేణు, రాములు, వెంకటేషం, శ్రీనివాస్ పాల్గొన్నారు.