నల్గొండ

అర్హులందరికీ గుర్తింపుకార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూదాన్‌పోచంపల్లి, ఆగస్టు 14: జియో ట్యాగింగ్ లేకున్నా, సంవత్సరంలో ఒక రోజు మగ్గం నేసినా ప్రభుత్వం చేనేత కార్మికులకు గుర్తింపుకార్డులు అందజేస్తుందని రాష్ట్ర చేనేత సేవాకేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ హిమజ్‌కుమార్ వెల్లడించారు. ఇందుకోసం అర్హులైన కార్మికులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని సరస్వతి మహిళా చేనేత ఉత్పత్తి, విక్రయ పరస్పర సహాయ, సహకార సంఘ సభ్యులకు 40 శాతం రాయితీపై నూలును అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార, సహకారేతర రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ ఒక్కో వర్క్‌షెడ్‌కు 1.20 లక్షలు మంజూరు చేస్తుందన్నారు. 90శాతం ఆధునిక మగ్గాలు, ఆసు యంత్రాలు అందజేస్తామన్నారు. పోచంపల్లి మండలానికి 9 ఆసు యంత్రాల మంజూరుకు ప్రతిపాదనలు పంపించామని ఆయన పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంఘం అధ్యక్షురాలు యెరవ నీలమ్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ సార సరస్వతి, ఎంపీటీసీలు కర్నాటి రవీందర్, గడ్డం ఆండాలు, నాయకులు తడక వెంకటేషం, భారత వాసుదేవ్, చింతకింది రమేష్, మంగళపల్లి శ్రీహరి, గుండు మధు, భారత లవకుమార్, కీస సత్యనారాయణ, మెరుగు శశికళ, గోషిక అన్నపూర్ణ, కర్నాటి పురుషోత్తం, సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా పంచనారసింహుని నిత్య కల్యాణం
యాదగిరిగుట్ట, ఆగస్టు 14: యాదగిరిగుట్ట శ్రీపంచలక్ష్మినారసింహుని క్షేత్రంలో మంగళవారం నిత్యారాధనలు, భక్తుల అర్జిత సేవలు, విశ్వక్‌సేన ఆరాధన, పుణ్యాహచనం, యజ్ఞం, సహస్రనామార్చన, అష్టోత్తర పూజలు జరిగాయి. వేకువజామున సుప్రభాతంతో స్వామి, అమ్మవార్లను మేల్కొలిపి హారతి నివేదన చేశారు. బిందెతీర్థం, స్వామివారికి బాలభోగంతో ఆలయ నిత్య కైంకర్యాలు ప్రారంభమయ్యాయి. మొదటగా ప్రతిష్టామూర్తులను ఆరాధించిన పూజారులు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పంచామృతంతో అభిషేకించి తులసీదళాలతో అర్చించారు. వివిధ రకాల సుగంధ పరిమళాల పూలమాలలు, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అత్యంత శోభాయమానంగా అలంకరించారు. దర్శనామూర్తులను స్వర్ణపుష్పాలతో ఆరాధించి అర్చించారు. అనంతరం అత్యంత సుందరంగా అలంకరించిన గజవాహనంపై స్వామి, అమ్మవార్లను అధిష్టించి సేవ ఉత్సవాన్ని నిర్వహించారు. తదుపరి స్వామి, అమ్మవార్ల నిత్య కల్యాణ మహోత్సవాన్ని పంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం శ్రీస్వామి, అమ్మవార్ల వెండి జోడి సేవ ఉత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. అలాగే యాదాద్రిపై క్షేత్రపాలకుడై వెలిసిన అంజనీ పుత్రుడు ఆంజనేయస్వామి వారికి మంగళవారం ఆకుపూజ కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా యాదగిరిశుని రోజువారీ ఆదాయంలో భాగంగా మంగళవారం రూ.6.88 లక్షలు సమకూరినట్లుగా దేవస్థాన అధికారులు తెలిపారు.