నల్గొండ

ప్రతిభతో క్రీడాకారులు రాష్ట్రానికి పేరు తేవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోదాడ, ఆగస్టు 17: సౌత్‌జోన్, జాతీయస్థాయి బాడ్మింటన్ టోర్నమెంట్‌ల్లో పాల్గొనే క్రీడాకారులు ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని సూర్యాపేట జిల్లా జాయింట్ కలెక్టర్ సంజీవరెడ్డి కోరారు. కోదాడ ఎల్డర్స్ రిక్రియేషన్ సొసైటీ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న 4వ, రాష్టస్థ్రాయి బాడ్మింటన్ సెలక్షన్స్ టోర్నమెంట్-2018ను శుక్రవారం జేసీ ప్రారంభించి ప్రసంగించారు. రాష్టస్థ్రాయి సెలక్షన్ టోర్నమెంట్ కోదాడలో నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్రం నలుమూలల నుండి పోటీలకు వచ్చిన క్రీడాకారులు తమలోని ప్రతిభను ప్రదర్శించి సౌత్‌జోన్, జాతీయస్థాయి టోర్నమెంట్‌లో పాల్గొనే తెలంగాణ జట్టుకు ఎంపిక కావాలని కోరారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన క్రీడాకారుల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరు ముందుకురావాలన్నారు. క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదన్నారు.
ప్రారంభ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ బాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్, జాస్తి శారదా గోవర్ధిని, తెలంగాణ బాడ్మింటన్ అసోసియేషన్ కోశాధికారి టీ.పాణిరావు, నల్లగొండ బాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఏటుకూరి రామారావు, తోట రంగారావు, డాక్టర్ యస్.అశోక్‌కుమార్, డాక్టర్ బీవీఎస్ ప్రసాద్, రావెళ్ల సీతారామయ్య, కొండపల్లి సింగయ్య, పెదనాటి వెంకటేశ్వర్‌రావు, మహేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
రాష్టస్థ్రాయి సెలక్షన్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ సంజీవరెడ్డి తదుపరి క్రీడాకారులను పరిచయం చేసుకొని మెయిన్ డ్రా మొదటి మ్యాచ్‌ను ఆడి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఇంటర్నేషనల్ ప్లేయర్ చేతన్ ఆనంద్ బాడ్మింటన్ కోర్టును ప్రారంభించారు. తొలుత మాజీ ప్రధాని వాజపేయ మృతికి అతిధులు, క్రీడాకారులు రెండు నిమిషాలు సంతాపం ప్రకటించారు.