నల్గొండ

నేరేడుచర్ల మున్సిపాల్టీ తాత్కాలికంగా నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడుచర్ల, ఆగస్టు 17: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటుచేసిన నేరేడుచర్ల మున్సిపాలిటీని తాత్కాలికంగా నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. నేరేడుచర్ల మేజర్ పంచాయతీని ప్రభుత్వం నిబంధనలను పాటించకుండా, గ్రామసభ నిర్వహించకుండా, ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా ఏర్పాటుచేసిన మున్సిపాలిటీని రద్దుచేయాలని దామినేని ప్రదీప్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు పంచాయతీకి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఎందుకు, ఏ కారణం చేత మున్సిపాలిటీగా మార్చారో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను పంచాయతీరాజ్, సెక్రటరీ, రూరల్ డెవెలప్‌మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్, నేరేడుచర్ల తహశీల్దార్, ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులకు జారీచేశారు.

వాజపేయి సహకారంతోనే రక్షిత జలాలు
- జలసాధన సమితి ఘన నివాళులు
నల్లగొండ రూరల్, ఆగస్టు 17: భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి మరణం దేశానికి తీరని లోటు అని జల సాధన సమితి అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ అన్నారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో వాజపేయి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈసందర్భంగా దుశ్చర్ల మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్, మూసీ మురికి, కాలుష్యపు జలాలతో ప్రజలు పడుతున్న ఇబ్బందిని 1993లో వాజపేయిని కలిసి మొరపెట్టుకున్నామన్నారు. దాదాపు అరగంటకు పైగా ఈ విషయంపై చర్చించామని గుర్తు చేసుకున్నారు. వెంటనే రక్షిత జలాల కోసం మూసీ రివర్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాన్ కోసం వాజపేయి రూ.350 కోట్లు కేటాయించి జిల్లాలో మంచినీటి పైప్‌లైన్లు, ట్యాంకుల నిర్మాణాలు చేపట్టేలా కృషి చేశారన్నారు. కృష్ణా జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని, కనుగ నదిపై ఎక్కువ ప్రాజెక్టులు నిర్మించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈకార్యక్రమంలో బండమీది అంజయ్య, బొమ్మకంటి సైదులు, కొత్తపల్లి నర్సింహ, లక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు.