నల్గొండ

భూమికి పచ్చాని రంగేసినట్లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వలిగొండ, ఆగస్టు 17: వారం రోజులుగా అడపాదడపా వరుణుడు కరుణించడంతో కురుస్తున్న వర్షాలతో మెట్ట పంటలు కళకళలాడుతున్నాయి. గత కొన్ని రోజులుగా వర్షాలు లేకపోవడంతో మెట్టపంటలైన పత్తి, కంది చేనులు ఎండిపోయే దశకు చేరుకోగా వారం రోజులుగా కురుస్తున్న వర్షం, ముసురుతో మెట్ట పంటలకు ప్రాణం వచ్చి చిగురిస్తుండడంతో పంటలు కళకళలాడుతున్నాయి. వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా భీమలింగం కాలువ కూడా మరమ్మతులు పూర్తి కావడంతో క్రమక్రమంగా కాలువ పరిధిలోని చెరువులన్ని నిండుతుండడంతో రైతులకు సాగునీటి సమస్యలు తీరినట్లయిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అటు వర్షం, ఇటు కాలువల ప్రవాహాలతో మండలంలోని రైతులు సంతోషంగా సాగుతున్నారు. మండల కేంద్రంలోని చెరువు ఆయకట్టు ప్రాంతంలో గత పక్షం రోజుల క్రితం నాట్లన్ని పూర్తి కావడంతో వలిగొండ వలిబాష గుట్టపై నుండి వీక్షిస్తే నేడు పంట పొలాలన్ని ఆకుపచ్చని రంగులో కనిపిస్తూ భూమికి పచ్చాని రంగేసినట్లు కనిపిస్తోంది.

దండుమల్కాపురానికి మహర్దశ
*మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి

చౌటుప్పల్, ఆగస్టు 17: విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో కాలుష్య రహితంగా సుమారు వెయ్యి ఎకరాలలో ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రీయల్ పార్కుతో దండుమల్కాపురం గ్రామానికి మహర్దశ రానుందని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం శివారులోని ఇండస్ట్రీయల్ పార్కు వౌలిక సదుపాయాల ఏర్పాట్లను శుక్రవారం ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు. సంబంధిత అధికారులతో పనుల పురోగతిని తెలుసుకున్నారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోనున్న ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాట్లపై సమీక్ష చేసారు. ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటుతో ఈ ప్రాంతం దశ మారిపోతుందన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. స్థానికులకే అధిక ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందన్నారు. పార్కు ఏర్పాటుకు ఇప్పటికే 370 ఎకరాల భూమిని సేకరించడం జరిగిందన్నారు. మిగిలిన భూమిని సేకరించేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. రూ.36కోట్లతో పార్కు అభివృద్ధి జరుగుతుందన్నారు. పార్కులో రోడ్లు, విద్యుత్, నీటి సౌకర్యం, డ్రైనేజీ తదితర వౌలిక వసతులు కల్పించే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని వివరించారు. ఆయన వెంట అధికారులు సుధీర్‌రెడ్డి, జ్యోతి తదితరులున్నారు.