నల్గొండ

ఉదయ సముద్రం పనులపై కలెక్టర్ సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్కట్‌పల్లి, ఆగస్టు 20: ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం పనుల తీరు తెన్నులపై సోమవారం జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మండలంలోని చౌడంపల్లి పంపుహౌజ్ వద్ద రివ్యూ నిర్వహించి అధికారుల నుండి పలు సమాచారాన్ని తెలుసుకున్నారు. మొదటగా పంపుహౌజ్ పనులను, డిస్ట్రిబ్యూటరీ, టనె్నల్ నిర్మాణ పనులను ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ అంశాలపై ఆరా తీసిన కలెక్టర్ అనంతరం అధికారులతో రివ్యూ సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి ప్రాజెక్టు వరకు పూర్తి కావాల్సిన 10.625 కిలోమీటర్ల టనె్నల్‌కు గానూ 10.512 మీటర్లు పూర్తి చేసినట్లు. మిగిలిన 103 మీటర్లు లూస్ టాయల్ కారణంగా ఆలస్యం జరుగుతుందని వివరించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నామని అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. 50 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు భూసేకరణ పూర్తి చేసినట్లు తెలిపారు. అనంతరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

యాదాద్రి కొండపై హరిహరనాథుల ఆరాధన
* నేటి నుండి యాదగిరీశుని పవిత్రోత్సవాలు
యాదగిరిగుట్ట, ఆగస్టు 20: అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు.. భక్తవత్సలుడు.. శ్రీపంచనారసింహుని క్షేత్రంలో శ్రీవిళంబినామ సంవత్సర శ్రావణ బహుళ దశమి మంగళవారం 21 నుండి శ్రావణ బహుళ ద్వాదశి గురువారం 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు ‘పవిత్రోత్సవాలు’ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ కలెక్టర్, దేవస్థాన కార్యనిర్వహణాధికారిణి ఎన్.గీత తెలిపారు. పవిత్రోత్సవాల సందర్భంగా భక్తులు జరిపించే మొక్కు కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు, అర్చనలు, అభిషేకాలు 22, 23 తేదీల్లో రద్దు చేయడం జరిగిందని, తిరిగి 24వ తేదీ శుక్రవారం నుండి యదావిధిగా అన్ని కైంకర్యాలు నిర్వహించబడతాయని తెలిపారు. ఏడాదిలో దేవాలయాల్లో నిర్వహించు బ్రహ్మోత్సవాలు, అధ్యయనోత్సవాల్లో తెలిసీ.. తెలియక జరిగే దోషములను తొలగించుటకు ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో నిర్వహించాలని ఆగమశాస్త్రంలో పేర్కొనబడింది. ఈ ఉత్సవాల్లో ఏడు రంగుల, 108 దారాలతో తయారు చేసిన పవిత్ర దార మాలలను ఆలయ శిఖరంపై మరియు స్వయంభు అయిన స్వామి, అమ్మవార్లకు, ఉత్సవమూర్తులకు ధరింపజేస్తారు. ప్రతియేటా నిర్వహించే పవిత్రోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఈవో గీత తెలిపారు.