నల్గొండ

వాన జోరు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఆగస్టు 20: అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న ముసురు వర్షాలు సోమవారం జోరందుకున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో వర్షాలు కురుస్తుండగా పలు మండలాల్లో భారీ వర్షాలు, వరదలతో చెరువులు, కుంటలు నిండి అలుగులు పోస్తుండగా, పలు గ్రామాల్లో పంటలు వరద నీటి ముంపుకు గురయ్యాయి. నల్లగొండ జిల్లాలో 40.9మిల్లిమీటర్లు, సూర్యాపేట జిల్లాలో 94.3, యాదాద్రిభువనగిరి జిల్లాలో 37.7మిల్లిమీటర్ల వర్షాపాతం నమోదైంది. సూర్యాపేట, నల్లగొండ, కోదాడ పట్టణాల్లో లోతట్టు నివాస ప్రాంతాలు జలమమమయ్యాయి. సూర్యాపేట ఎస్‌వి ఇంజనీర్‌ంగ్ కళాశాల వరద నీటి దిగ్భంధానికి గురైంది. సూర్యాపేట జిల్లా పరిధిలో నడిగూడెం, చిలుకూరు, అనంతగిరి, హుజూర్‌నగర్, కోదాడ, అర్వపల్లి, నేరడుచర్ల, తుంగతుర్తి, మేళ్లచెర్వు మండల్లాలో అధిక వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లగా రోడ్లు, కాజ్‌వేల మీదుగా వరద నీరు సాగడంతో పలుచోట్ల వాహనాల రాకపోకలు ఆటంకాలు కలిగాయి. నడిగూడెం మండలంలో 760ఎకరాల పంటలు వరద నీటి ముంపుకు గురయ్యాయి. చిలుకూరు-పోతేనిగూడెం డైవర్షన్ రోడ్డు తెగిపోయింది. 600ఎకరాలకు పైగా పంటలు నీట మునిగాయి. ఆత్మకూర్(ఎస్) మండలంలో నెమ్మికల్ గ్రామంలో వర్షాలతో గోడ కూలి గంపల మల్లమ్మ(85) మృతి చెందింది. అనంతగిరి మండలంలో పాలారం చెరువుకు గండి పడింది. కోదాడ, ఆనంతగిరి మండలాల్లో ఐదేళ్ల పిదప పాలేరు వాగు, కూచిపూడి వాగులు పొంగి పొర్లాయి. ఇళ్లలోకి, పంట పొలాల్లోకి వరద నీరు చేరింది. నల్లగొండ జిల్లాలో మాడ్గులపల్లిలో 100.5, వేములపల్లిలో 102.8, నల్లగొండలో 64.2, కేతెపల్లిలో 76.3, తిప్పర్తిలో 76.7, నకిరేకల్‌లో 61.3, మిర్యాలగూడలో 66.3, దామరచర్లలో 67.1మిల్లిమీటర్ల వర్షాపాతం నమోదైంది.