నల్గొండ

ఎంఐఎం అజెండాను అమలు చేస్తున్న టీఆర్‌ఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట టౌన్, సెప్టెంబర్ 17: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ ఎంఐఎం అజెండాను అమలు చేస్తోందని, ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి ఇప్పడు మాట తప్పిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు విమర్శించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినం సందర్బంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ నాడు జరిగిన ఉద్యమంలో నిజాం నవాబుకు, రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కొన్ని వేల మంది నిజాం నవాబు చేతిలో తమ ధన, మాన, ప్రాణాలను కోల్పోయారన్నారు. నాటి పోరాటంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా కీలక పాత్ర పోషించిందని జిల్లాలో కొన్ని వందల ఇండ్లను రజాకార్లు నేలమట్టం చేశారన్నారు. బండి యాదగిరి లాంటి ఎంతో మంది కళాకారులు నాటి ముష్కరమూఖల చేతిలో ప్రాణాలు వదిలారన్నారు. అలాంటి నిజాం నిరంకుశ పాలన అంతమైన సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా జరుపుకోవాలని మలిదశ ఉద్యమంలో అన్న కేసీఆర్ ఇప్పడు మాట తప్పారన్నారు. తెలంగాణ రాగానే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంఐఎం అజెండాను అమలు చేస్తూ విమోచన దినం నిర్వహిస్తే పోలీసులచే రౌడీషీట్లు, కేసులు పెట్టించే పరిస్థితి నెలకొందన్నారు. విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ ఎప్పటి నుండో డిమాండ్ చేస్తుందన్నారు. టీఆర్‌ఎస్‌కు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారనే ముందస్తు ఎన్నికలకు వెళ్తుతుందని, జమిలి ఎన్నికలకు సిద్ధమని ప్రకటించి ముందస్తుకు ఎందుకు వెళ్తున్నారో చెప్పాలన్నారు. టీఆర్‌ఎస్ ప్రకటించిన 105 అభ్యర్థుల్లో 45మందికి పైగా అసమ్మతి ఉందన్నారు. రాష్ట్రంలో ఏ వర్గం కూడా టీఆర్‌ఎస్‌వైపు లేదని ఉద్యోగులు, నిరుద్యోగులు, దళితులు, రైతులు, విద్యార్దులు అన్ని కుల, మతాల వారు టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. రాష్ట్ర ఏర్పాటులో ప్రధానమైన నీళ్ళు, నిధులు, నియామకాలను తెరాస ఎప్పడో మర్చిపోయిందన్నారు. మిషన్ భగీరథ ఏమైందో చెప్పాలన్నారు. దొంగ నోట్ల చెలామణి, నయిం డైరీలో పేరున్న తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ లాంటి వారికి ప్రజలు ఇంకా ఎందుకు ఓట్లు వేయాలని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న గొర్లు, చేప పిల్లల్లో భారీ అవినీతి జరిగిందన్నారు. నిరుద్యోగులు టీఆర్‌ఎస్ ఓటమికి కంకణం కట్టుకున్నారన్నారు. సూర్యాపేటలో అభివృద్ది ముసుగులో భారీ అవినీతి జరుగుతుందన్నారు. మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి అధికారంలోకి వస్తే మళ్లీ ఆ ఇద్దరి పెత్తనమే ప్రజలపై రుద్దడం జరుగుతుందని, పటేల్ రమేష్‌రెడ్డిది అమ్ముడుపోయే చరిత్ర అని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొణతం సత్యనారాయణరెడ్డి నాయకులు ఆబీద్, చల్లమళ్ల నర్సింహా, రంగరాజు రుక్మారావు, బండపల్లి పాండురంగాచారి, వాసుదేవరెడ్డి, నల్లకుంట్ల అయోద్య, రంగినేని ఉమాలక్ష్మణ్‌రావు, గార్లపాటి మమతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు జాతీయ జెండాను ఎగరవేశారు.
కాంగ్రెస్ గెలుపు ఖాయం.. కోమటిరెడ్డి
నల్లగొండ రూరల్, సెప్టెంబర్ 17: ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని కేసిఆర్ గద్దె దిగడం తధ్యమని మాజీ మంత్రి , మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో అక్కచల్మ కాలనీలో మైనార్టీలను కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. భాస్కర్ టాకీస్ సెంటర్లో చిరు వ్యాపారులను కలిసి వారి సమస్యలను తెల్సుకొని తనను గెలిపించాలని కోరారు.