క్రైమ్/లీగల్

వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోత్కూరు, సెప్టెంబర్ 18: ఓ వస్త్ర దుకాణంలో మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన సంఘటన మోత్కూరు మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్‌లోని పగడినగర్‌కు చెందిన దేవాసి మహేష్, మాణిక్‌లనే అన్నదమ్ములు కొద్దికాలం క్రితం మోత్కూరులో క్రిష్ణా ఫ్యాషన్ పేరుతో రెండస్తుల భవనంలో బట్టల దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం దసరా పండుగకై బట్టల స్టాక్‌లను రాత్రి వరకూ దుకాణంలో సర్ది మూసివేసినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా రాత్రి 11గంటల వరకూ బట్టలు సర్దిన సిబ్బంది దేవాసి పింజారం, రాహుల్, మహేందర్‌లు పై అంతస్తులో నిద్రించగా, అర్ధరాత్రి ఒక్కసారిగా దుకాణం కింది భాగంలో మంటలు వ్యాపించడంతో మంటల వేడికి ఉలిక్కిపడ్డ సిబ్బంది అప్రమత్తమై దుకాణం వెనుకవైపు నుండి బయటకు వచ్చి యజమానికి ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. వెంటనే వచ్చిన యజమానితో పాటు సిబ్బంది మంటలు ఆర్పేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోవడంతో ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించగా మోత్కూరు, రామన్నపేటకు చెందిన ఫైర్ ఇంజన్లు, ఫైర్, మోత్కూరు పోలీసులు ఉదయం తొమ్మిది గంటల వరకూ మంటలు ఆర్పినప్పటికీ అప్పటికే పూర్తి నష్టం జరిగిపోయింది. ఇదే విషయంపై దుకాణపు యజమాని మనీష్ మాట్లాడుతూ కోటి విలువైన వస్త్రాలు, ఫర్నీచర్ దగ్ధమైనట్లు బోరున విలపిస్తూ తనను ఆదుకోవాలన్నారు.

పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
అడ్డగూడూరు, సెప్టెంబర్ 18:పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన సుతారపు యాదగిరి (55) వ్యవసాయమే జీవనాధారంగా గడుపుతుండగా, వర్షాలు సకాలంలో కురవకపోవడంతో దిగుబడి తగ్గుతదని, అప్పులెక్కువయ్యాయనీ భావించి పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని కుటుంబాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ మహేంద్రనాధ్ ఓదార్చి తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆదేశాల మేరకు 5వేల ఆర్ధిక సహాయం అందజేశారు.