నల్గొండ

భువనగిరి టీఆర్‌ఎస్ అభ్యర్థిని మార్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వలిగొండ, సెప్టెంబర్ 18: అపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే రాష్ట్రం ఎంతో అభివృద్ది చెందిందని టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ప్రాణత్యాగానికైన వెనకాడలేదని అందుకే 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన తాను టీఆర్‌ఎస్ పార్టీలో చేరానన్నారు. కేసీఆర్ మాటకు కట్టుబడి భువనగిరి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకున్నామన్నారు. కేసీఆర్ నాయకత్వంలో నాయకులను గెలిపిస్తే కార్యకర్తలను విస్మరిస్తున్నారని స్థానిక మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారన్నారు. సమర్థుడైన నాయకుడికి అవకాశం ఇవ్వాలని ప్రస్తుత అభ్యర్థిని మార్చాలన్నారు. కేసీఆర్ ఆశీస్సులతో నియోజకవర్గంలో పార్టీని ముందుకు నడిపిస్తానని, ఆయన ఆదేశిస్తే పోటీకి దిగుతానన్నారు. ప్రస్తుత తాజా మాజీ ఎమ్మెల్యే పైళ్ల స్థానిక నాయకుడు కాదని బలమైన వాదన వినిపిస్తుందని స్థానికులకు టికెట్ ఇవ్వాలన్నారు. భువనగిరి ఎమ్మెల్యేలుగా రావి నారాయణరెడ్డి, ఎలిమినేటి మాధవరెడ్డి వంటి హేమాహేమీలు రాష్ట్రంలో భువనగిరికి ప్రథమ స్థానం ఉండేలా చూశారని, కాని తాజా మాజీ ఎమ్మెల్యే మాత్రం అసెంబ్లీలో నాలుగున్నర ఏండ్లల్లో 72 సెకన్లు మాత్రమే మాట్లాడడం జరిగిందని దీనితో ఎమ్మెల్యే సామర్థ్యం ఎంతో తెలుస్తుందన్నారు. ఉమ్మడి జిల్లాల్లో రెండు, మూడు సీట్లు మార్చే అవకాశం ఉంటుందని నాలుగున్నర ఏండ్లలో స్థానిక ఎమ్మెల్యే ఏమీ నేర్చుకోలేకపోయారని, ప్రజల అభిప్రాయాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానన్నారు. త్వరలోనే భువనగిరిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తానన్నారు. సమావేశంలో తుమ్మల యుగంధర్‌రెడ్డి, గరిసె రవి, పుల్లగూర్ల జంగారెడ్డి, సయ్యద్ పాషా, కుతాడి సురేశ్, బండి రవి, శ్యామల యాదమ్మ, గంధమల్ల మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం..
కోటి విలువైన ఆస్తి నష్టం.. * పూర్తిగా దగ్ధమైన షాపు
మోత్కూరు, సెప్టెంబర్ 18: ఓ వస్త్ర దుకాణంలో మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన సంఘటన మోత్కూరు మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్‌లోని పగడినగర్‌కు చెందిన దేవాసి మహేష్, మాణిక్‌లనే అన్నదమ్ములు కొద్దికాలం క్రితం మోత్కూరులో క్రిష్ణా ఫ్యాషన్ పేరుతో రెండస్తుల భవనంలో బట్టల దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం దసరా పండుగకై బట్టల స్టాక్‌లను రాత్రి వరకూ దుకాణంలో సర్ది మూసివేసినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా రాత్రి 11గంటల వరకూ బట్టలు సర్దిన సిబ్బంది దేవాసి పింజారం, రాహుల్, మహేందర్‌లు పై అంతస్తులో నిద్రించగా, అర్ధరాత్రి ఒక్కసారిగా దుకాణం కింది భాగంలో మంటలు వ్యాపించడంతో మంటల వేడికి ఉలిక్కిపడ్డ సిబ్బంది అప్రమత్తమై దుకాణం వెనుకవైపు నుండి బయటకు వచ్చి యజమానికి ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. వెంటనే వచ్చిన యజమానితో పాటు సిబ్బంది మంటలు ఆర్పేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోవడంతో ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించగా మోత్కూరు, రామన్నపేటకు చెందిన ఫైర్ ఇంజన్లు, ఫైర్, మోత్కూరు పోలీసులు ఉదయం తొమ్మిది గంటల వరకూ మంటలు ఆర్పినప్పటికీ అప్పటికే పూర్తి నష్టం జరిగిపోయింది. ఇదే విషయంపై దుకాణపు యజమాని మనీష్ మాట్లాడుతూ కోటి విలువైన వస్త్రాలు, ఫర్నీచర్ దగ్ధమైనట్లు బోరున విలపిస్తూ తనను ఆదుకోవాలన్నారు.