నల్గొండ

తల్లి తర్వాత తల్లి అంగన్‌వాడీలే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుంగతుర్తి, సెప్టెంబర్ 18: తల్లి తరువాత తల్లి అనే అరుదైన గౌరవం అంగన్‌వాడీలకే దక్కుతుందని భువనగిరి పార్లమెంటు సభ్యుడు బూర నర్సయ్యగౌడ్ అన్నారు. మంగళవారం స్థానిక ఐసీడీఎస్ కార్యాలయంలో సీడీపీఓ వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఇంటింటా పోషన్ అభియాన్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మనిషి జన్మ, పెరుగుదల తల్లి గర్భంతో పాటు అంగన్‌వాడీ గర్భంపై ఆధారపడి ఉందన్నారు. ముఖ్యంగా దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అంటూ మహాకవి గురజాడ పిలుపునిచ్చిన మాదిరిగా మనిషి బలీయంగా ఉన్నప్పుడే దేశం కూడా గట్టిగా తయారవుతుందని పేర్కొన్నారు. మనిషికి బలయమైన మేధోసంపత్తి కల్పించేది కేవలం అంగన్‌వాడీల ద్వారానే సాధ్యమన్నారు. నేడు పేదరికంతోపాటు అవగాహన లోపంతోనే మనిషి బలీయమైన శక్తిగా ఎదగలేని పరిస్థితి నెలకొందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల్లో పౌష్టికాహరం పట్ల అవగాహన లేదని, వారంతా పురాతన ఆహారపు అలవాట్లలోనే ఉండటం వల్ల పౌష్టికాహరం లోపిస్తోందని ఆయన వివరించారు. నేడు ఇండ్లల్లో నివసిస్తూ చదివే విద్యార్థుల కంటే రెసిడెన్సియల్ పాఠశాలల్లో చదివే వారే ఆరోగ్యవంతంగా ఉంటున్నట్లు పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలపై ప్రజల్లో నిర్లక్ష్యభావం ఉందని దీన్ని రూపుమాపుతూ వారిలో చైతన్యం తేవాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల పేరుని ప్రీ స్కూల్స్‌గా మార్చాలని ఆయన సూచించారు. ఈసందర్బంగా ఉమ్మడి జిల్లా స్ర్తి, శిశుసంక్షేమ శాఖ అధ్యక్షురాలు మాలె శరణ్యారెడ్డి మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలకు తాజాగా నందిని కంపెనీ ద్వారా పాల పంపిణీ జరగాలని కోరారు. నాణ్యమైన సన్న బియ్యాన్ని సరఫరాపై ప్రభుత్వంతో చర్చించాలని కోరారు. సమావేశంలో అసిస్టెంట్ సీడీపీఓ సింధు, సూపర్‌వైజర్లు మంగతాయమ్మ, షమీంభీ, హనీఫా, జ్యోతిలతోపాటు పలు మండలాలల నుండి కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకు ముందు ఇంటికి అంగన్‌వాడీ పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన స్థానిక రామాలయం ఎదుట ఉన్న వినాయక విగ్రహం వద్ద పూజలు నిర్వహించారు.

ప్రణయ్‌ది కుల తీవ్రవాద హత్య..
* బాధితురాలు అమృత ఇండియా మలాల కావాలి
* ప్రేమ పెళ్లిల రక్షణ (అమృత) చట్టం తీసుకురావాలి
* టీ మాస్ చైర్మన్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య
మిర్యాలగూడ టౌన్, సెప్టెంబర్ 18: పట్టణంలో జరిగిని దళిత యువకుడు ప్రణయ్‌కుమార్ హత్య కులతీవ్రవాద హత్య అని టీ మాస్ చైర్మన్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు. మంగళవారం మిర్యాలగూడలో ప్రణయ్ ఇంటిని సందర్శించి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రణయ్ తల్లిదండ్రులు హేమలత, బాలస్వామి, భార్య అమృతవర్షిణి, తమ్ముడు అజయ్‌కుమార్లను పరామర్శించారు. అనంతరం ఐలయ్య మాట్లాడుతూ ఏ కులం అని ఆలోచించకుండా అమృత ప్రేమించి పెళ్లి చేసుకుందని, హాయిగా జీవితం గడుపుతున్నారన్నారు. కుల దురహంకారంతో ప్రణయ్‌ను హత్య చేయించడంలో తీవ్రవాద శక్తులున్నారని ఇది దారుణమన్నారు. ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న వారికి రక్షణ చట్టం అది కూడా అమృత చట్టంగా తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందుకు ఏపీ సీఎం చంద్రబాబు కూడా ముందుకు రావాలని కోరారు. పాకిస్తాన్‌లో తీవ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడిన మలాలా లాగా అమృత కావాలన్నారు. కులాంతర వివాహం చేసుకుని, భర్తను విపరీతంగా ప్రేమిస్తున్న ఆమెను అందరు ఆదరించాలన్నారు. అమృత తండ్రి ఆస్తులు అమృతకు చెందేలా మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, ఎంపీ టీజీ వెంకటేశ్‌లు ముందుకు వచ్చి చర్యలు తీసుకోవాలని ఆయన హితవు పలికారు. అదేవిధంగా ఆమెను మిర్యాలగూడ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏకగ్రీవంగా చేయాలని టీఆర్‌ఎస్, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ అధ్యక్షులు కేసీఆర్, రమణ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, లక్ష్మణ్‌లకు లేఖ రాస్తానన్నారు. సమావేశంలో సీపీఎం నాయకులు జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, ఎంబీటీ నాయకులు మజీదుల్లాఖాన్, రమేష్, నాగరాజు, టీ మాస్ కన్వీనర్ జాన్‌వెస్లి, శ్రీరాంనాయక్ ఉన్నారు.